Rainy Season Smartphone Tips: వర్షంలో స్మార్ట్‌ఫోన్ ఇలా ఉపయోగిస్తున్నారా.. చాలా డేంజర్ జాగ్రత్త..
ABN , Publish Date - Jun 30 , 2025 | 04:54 PM
వర్షాకాలంలో అప్పుడప్పుడు ఫోన్లు తడిసి ఉపయోగించడం చాలా కష్టంగా మారుతుంది. అలాంటి సమయంలో టచ్ స్క్రీన్ స్పందించదు. ఇలాంటి సందర్భాల్లో కొన్నిసార్లు ఫోన్ చేజారిపోయే అవకాశం ఉంది. కాబట్టి వానా కాలంలో స్మార్ట్ ఫోన్ యూజర్లు కొన్ని చిట్కాలను పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇక్కడ చూద్దాం.

ఇంటర్నెట్ డెస్క్: వర్షాకాలం వచ్చేసింది. ఈ కాలంలో బయటకు వెళ్తే చాలు ఎప్పుడు హఠాత్తుగా వర్షం వచ్చి తడిచిపోతామో తెలియదు. బట్టలు సహా శరీరం మెుత్తం తడిచి ముద్దవుతుంది. ఇలాంటి వేళ స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించడం కష్టంగా మారుతుంది. అలాంటి సమయంలో ఫోన్ ఉపయోగించకూడదని, సురక్షితంగా ఉంచుకోవడానికి కొన్ని చిట్కాలు పాటించాలని నిపుణులు (Rainy Season Smartphone Tips) చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
1. వాటర్ ప్రూఫ్ పౌచ్
మీ స్మార్ట్‌ఫోన్ వర్షంలో తడవకుండా ఉండేందుకు మంచి నాణ్యత గల వాటర్‌ప్రూఫ్ పౌచ్ ఉపయోగించాలి. ఒకవేళ అది సాధ్యం కాకపోతే, కనీసం జిప్‌లాక్ బ్యాగ్‌లను ఉపయోగించండి. ఇలా చేయడం ద్వారా ప్రయాణంలో ఉన్నప్పుడు ఆకస్మిక వర్షం లేదా నీటి చుక్కల నుంచి మీ ఫోన్‌ను రక్షించుకోవచ్చు.
2. తడి చేతులతో ఛార్జింగ్
నీరు, విద్యుత్ కలిస్తే చాలా ప్రమాదం. కాబట్టి తడి చేతులతో ఫోన్ ఛార్జింగ్ చేసే విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. ఫోన్ తడిగా ఉన్నప్పుడు ఛార్జర్‌కు కనెక్ట్ చేయొద్దు. ఇది సాధారణ విషయంలా అనిపించినా, ఫోన్‌కు శాశ్వత నష్టం కలిగించవచ్చు లేదా షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం ఉంది. ఇది ప్రాణాంతకంగా మారే ఛాన్సుంది.
3. బ్యాటరీ సేవర్ ఆన్
వర్షా కాలంలో గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల బ్యాటరీ త్వరగా అయిపోవచ్చు. మీరు ప్రయాణంలో ఉన్నప్పుడు లేదా ఛార్జింగ్ సౌకర్యం లేనప్పుడు, బ్యాటరీ సేవర్ మోడ్‌ను ఆన్ చేయడం ద్వారా బ్యాటరీని ఆదా చేసుకోవచ్చు.
4. ఫోన్ తడిస్తే వెంటనే
మీ ఫోన్ ఒకవేళ అనుకోకుండా తడిస్తే ముందుగా దాన్ని వెంటనే ఆఫ్ చేయండి. చాలామంది దానిని హెయిర్ డ్రైయర్‌తో ఫోన్‌ను ఆరబెట్టడానికి ప్రయత్నిస్తారు. కానీ అలా చేయొద్దని నిపుణులు చెబుతున్నారు. మీ ఫోన్‌ను పొడి గుడ్డతో తుడిచి, కొన్ని గంటల పాటు పొడి బియ్యం లేదా సిలికా జెల్ ప్యాకెట్‌లలో ఉంచాలని అంటున్నారు.
5. బ్యాకప్‌ను ఆన్
వర్షా కాలంలో మీ ఫోన్ పాడైపోయే అవకాశం ఎక్కువ. కాబట్టి ఎప్పటికప్పుడు మీ కాంటాక్ట్స్, ఫోటోలు, వాట్సాప్ చాట్స్, ముఖ్యమైన డాక్యుమెంట్స్‌ను గూగుల్ డ్రైవ్ లేదా ఐక్లౌడ్‌లో సేవ్ చేసుకోవడం మంచిది.
6. వాటర్ రెసిస్టెంట్ కేస్
మీరు తరచూ ప్రయాణం చేస్తుంటే లేదా టూ వీలర్‌పై వెళ్తుంటే మిలిటరీ గ్రేడ్ లేదా IP68 రేటెడ్ వాటర్ రెసిస్టెంట్ కేస్ ఉపయోగించండి. ఇవి నీరు, షాక్ నుంచి మీ ఫోన్‌ను రక్షిస్తాయి.
7. ఛార్జింగ్ పోర్ట్
వర్షా కాలంలో మాత్రమే కాకుండా, ఇతర సీజన్లలోనూ మీ ఫోన్‌లో దుమ్ము, తేమ పేరుకుపోతాయి. ఇవి USB-C లేదా లైట్నింగ్ పోర్ట్‌ను అడ్డుకోవచ్చు. కాబట్టి కొన్ని రోజులకు ఒకసారి సాఫ్ట్ బ్రష్ లేదా బ్లోవర్‌తో మీ స్మార్ట్ ఫోన్ పోర్ట్‌ను క్లీన్ చేయండి.
ఇవీ చదవండి:
కొత్త ఫ్లాష్ సేల్ ఆఫర్.. రూ.400కు 400 జీబీ డేటా
సిబిల్ స్కోర్ కారణంగా ఉద్యోగం తొలగింపు..
మరిన్ని ఏపీ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి