TRAI: సిగ్నల్, నెట్ లేకపోతే సైలెంట్ కాదు..ఫిర్యాదు చేయడం మరింత ఈజీ తెలుసా..
ABN , Publish Date - Apr 22 , 2025 | 07:51 AM
టెలికాం యూజర్ల ఇబ్బందులను తొలగించేందుకు ట్రాయ్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో TRAI కొత్త పోర్టల్‌ను ప్రారంభించింది. దీని ద్వారా వినియోగదారులు ఈజీగా ఫిర్యాదు చేయవచ్చని తెలిపింది.

దేశంలో పలువురు టెలికాం కస్టమర్లు నెట్‌వర్క్ రాకపోవడం లేదా ఇంటర్ నెట్ వంటి అనేక సమస్యలను ప్రతి రోజు ఏదో ఒక చోట ఎదుర్కొంటున్నారు. కాల్స్ పదే పదే ఆగిపోవడం, లేదా కొన్నిసార్లు నెట్‌వర్క్ అస్సలు అందుబాటులో ఉండదు. అయితే, ఈ సమస్యలను పరిష్కరించడానికి టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇలాంటి ఇబ్బందులు ఎదురైన కస్టమర్లు ఆ సమస్యల గురించి ఫిర్యాదు చేసే ప్రక్రియను TRAI మరింత సులభతరం చేసింది. ఈ క్రమంలో TRAI ఒక కేంద్రీకృత పోర్టల్‌ను ప్రవేశపెట్టింది. మీరు ఈ వెబ్ సైట్ ఓపెన్ చేసి ఈజీగా ఫిర్యాదు చేసుకోవచ్చని తెలిపింది.
ఇలా ఫిర్యాదు చేయవచ్చు
ఫిర్యాదు చేయడానికి మీరు https://tccms.trai.gov.in/Queries.aspx?cid=1 పోర్టల్‌ను మొదట సందర్శించాలి
ఆ తర్వాత, మీరు మీ సర్వీస్ ప్రొవైడర్, రాష్ట్రం, జిల్లాను ఎంచుకోవాలి
అక్కడ మీ ఫిర్యాదుకు సంబంధించిన అన్ని వివరాలను నమోదు చేసిన తర్వాత, ఈ ఫిర్యాదు మీకు సమీపంలోని ఫిర్యాదు కేంద్రానికి పంపించబడుతుంది
ఈ క్రమంలో మీకు ఏదైనా సమస్య ఉంటే దాని గురించి ఫిర్యాదు చేసి, TRAI ఈ కొత్త పోర్టల్‌ను సద్వినియోగం చేసుకోవచ్చు.
ఇప్పటికే టెలికాం ప్రొవైడర్లు తమ వెబ్‌సైట్‌లో తమ కవరేజ్ మ్యాప్‌ను ప్రచురించడాన్ని TRAI తప్పనిసరి చేసింది. తద్వారా ఈ మ్యాప్ సహాయంతో వినియోగదారులు తమ ప్రాంతంలోని నెట్‌వర్క్‌ను తనిఖీ చేసుకునే సమాచారాన్ని అందిస్తుంది.
మొబైల్ వినియోగదారులకు TRAI హెచ్చరిక
ఇది కాకుండా, లక్షలాది మంది మొబైల్ వినియోగదారులకు TRAI ఒక ముఖ్యమైన హెచ్చరిక కూడా జారీ చేసింది. మీ KYC అప్‌డేట్ లేదా సిమ్ క్లోజ్ అయ్యిందని మీకు ఏదైనా ఫోన్ కాల్, స్కామ్‌లు వస్తే జాగ్రత్తగా ఉండాలని సూచించింది. మీరు అలాంటి కాల్ లేదా సందేశాన్ని పట్టించుకోకూడదని, ఇటీవల, KYC సమాచారాన్ని అప్ డేట్ చేయండి, SIM కార్డును బ్లాక్ చేయడం పేరుతో TRAI నుంచి కాల్ చేస్తున్నామని స్కామర్లు కొంతమందిని బురిడి కొట్టించిన కేసులు వెలుగులోకి వచ్చినట్లు చెప్పారు.
ట్రాయ్ అలాంటి కాల్స్ లేదా సందేశాలను ఏ విధంగానూ చేయదని స్పష్టం చేసింది. ఏదైనా మొబైల్ నంబర్‌ను డీయాక్టివేట్ చేసే హక్కు టెలికాం కంపెనీకి మాత్రమే ఉందని TRAI చెబుతోంది. మీ KYC సమాచారం తప్పుగా ఉంటే లేదా మీరు మీ బిల్లులు చెల్లించనప్పుడు కూడా ఇది జరుగుతుందన్నారు.
ఇవి కూడా చదవండి:
Google CCI: గూగుల్ కీలక నిర్ణయం..ఆ కేసు పరిష్కారం కోసం రూ.20.24 కోట్లు చెల్లింపు
Scam Payments: మార్కెట్లోకి నకిలీ ఫోన్ పే, గూగుల్ పే యాప్స్.. జర జాగ్రత్త..
Viral News: 70 ఇన్ స్పేస్..అంతరిక్షంలో రోదసీ యాత్రికుడి బర్త్ డే సెలబ్రేషన్
Bill Gates: వారానికి మూడు రోజేలే పని..బిల్ గేట్స్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Read More Business News and Latest Telugu News