Share News

Northern Lights: మీరెప్పుడైనా 'అరోరా బొరియాలిసిస్' చూశారా.?

ABN , Publish Date - Nov 16 , 2025 | 04:29 PM

అంతరిక్షం అంటే అదో అద్భుతం. అలాంటి అద్భుతమైన ప్రపంచంలోకి వెళ్లిన ఓ వ్యోమగామి.. అక్కడి నుంచి ఓ వీడియోను తీశారు. దాన్ని సోషల్ మీడియాలో పంచుకోగా అది ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇంతకీ అందులో ఆ వ్యోమగామి ఏం కవర్ చేశారు? వాటి సంగతులేంటి? దానిపై నెటిజన్ల స్పందన ఎలా ఉందో.. ఆ వివరాలు మీకోసం...

Northern Lights: మీరెప్పుడైనా 'అరోరా బొరియాలిసిస్' చూశారా.?
Aurora borealis or Northern lights

ఇంటర్నెట్ డెస్క్: అరోరా బొరియాలిసిస్(Aurora Borealis) అంటే ఏంటో తెలుసా? ఎలా ఉంటుందో చూశారా? అంటే దాదాపుగా లేదనే సమాధానమే వస్తుంది. కొందరైతే ఎప్పుడో స్కూల్ ఏజ్‌లో చదువుకున్నట్టు గుర్తు అన్నట్టుగా జవాబిస్తారు. అలాంటి అరుదైన సన్నివేశాలను.. ఇటీవల అంతరిక్షంలోకి వెళ్లిన జానీ కిమ్ అనే నాసా వ్యోమగామి(NASA Astronaut Jonny Kim) ఒకరు వీడియో తీశారు. ఆ అద్భుతమైన వీడియోను ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇటీవల ఏర్పడిన అరోరా బొరియాలిసిస్ సహా.. కెనడా దేశంలోని కాల్గరీ ప్రాంతంలో కనిపించే మంటలు అందులో కవర్ అయ్యాయి. 'Sept 08, 2025' టైటిల్ పేరిట ఇన్‌స్టా గ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో తెగవైరల్ అవుతోంది.

ఆ వీడియో క్లిప్ మీకోసం..


అసలేంటీ అరోరాస్?

NOAA(National Oceanic and Atmospheric Administration) అంతరిక్ష వాతావరణ కేంద్రం.. నవంబర్ 12న జీ4(తీవ్రమైన) తుపాను స్థాయిలు సంభవించినట్టు ధృవీకరించింది. ఈ సౌర తుపానులు భూ అయస్కాంత క్షేత్రాన్ని తాకినప్పుడు అరోరా బొరియాలిసిస్(ఉత్తర దీపాలు), ఆరోరా ఆస్ట్రాలిస్(దక్షిణ లైట్లు)ల అద్భుతమైన ప్రదర్శనలు కనిపిస్తాయి(aurora australis). ఎలక్ట్రాన్లు, ప్రోటాన్ల ప్రవాహమైన సూర్యరశ్మి ద్వారా వెలువడిన కణాలు భూ అయస్కాంత క్షేత్రం, వాతావరణంతో సంఘర్షణ చెందినప్పుడు ఆకుపచ్చ, ఎరుపు, ఊదా రంగులతో సహా ప్రకాశవంతమైన రంగులలో అరోరాస్ సంభవిస్తాయి. ఇలా సౌర జ్వాలలు, కరోనల్ మాస్ ఎజెక్షన్ల(CMEs) సమయంలో సూర్యుని కొరోనా నుంచి సౌర గాలి బయటకు వస్తుంది.


ఎవరీ జానీ కిమ్?

అమెరికన్ నేవీ విభాగానికి చెందిన లెఫ్టినెంట్ కమాండర్(LCDR, US Navy) జానీ కిమ్‌ను 2017లో నాసాకు ఎంపికయ్యారు. SEAL(Navy Sea, Air and Land Teams) విభాగానికి చెందిన మాజీ ఉద్యోగి అయిన కిమ్.. నావల్ ఏవియేటర్, ఫ్లైట్ సర్జన్ హోదాలో ఉండేవారు. ఈ హోదాలో ఆయన సుమారు వందకుపైగా కాంబట్ ఆపరేషన్లలో పాలుపంచుకున్నారు. 2020లో మిషన్ కంట్రోల్ సెంటర్ హ్యూస్టన్‌లో క్యాప్‌కామ్(క్యాప్యూల్ కమ్యూనికేషన్)గా, ఆస్ట్రోనాట్ ఎక్స్‌ప్లోరేషన్ బ్రాంచ్ కింద ఆర్టెమిస్ ప్రోగ్రామ్‌కు ISS(International Space Station) కార్యకలాపాలకు సపోర్ట్‌గా ఉండేవారు. ఆ తర్వాత 2021లో ఎక్స్‌పెడిషన్ 65కు ISS ఇంక్రిమెంట్ లీడ్‌గా పనిచేశారు.


సోషల్ మీడియా స్పందన..

'ఈ దృశ్యం ద్వారా మన ప్రపంచాన్ని చూడటం అభినందనీయం.!' అని పలువురు మెచ్చుకోగా, కొందరు 'ఓమై గాడ్! వాటిని భూమ్మీది నుంచి చూడటమే ఒక ఎత్తు, అలాంటిది అంతరిక్షం నుంచి వీక్షించడం అద్భుతం' లాంటి కామెంట్లు రాశారు. తాము ఆన్‌లైన్‌లో చూసిన అత్యుత్తమ విశేషాలలో ఇదొకటంటూ మరి కొందరు ప్రశంసిస్తూ కిమ్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.


ఇవీ చదవండి:

Car parking: అక్కడ.. 800 కార్లు పార్క్‌ చేయొచ్చు...

Drone chases the accused: వరుడిపై కత్తితో దాడి.. నిందితుడ్ని వెంటాడిన డ్రోన్!

Updated Date - Nov 16 , 2025 | 07:08 PM