Maithili Thakur: బిహార్ ఎన్నికల్లో విజయం సాధించిన 'స్టేట్ ఐకానిక్' మైథిలీ ఠాకూర్
ABN , Publish Date - Nov 14 , 2025 | 07:11 PM
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జానపద గాయని మైథిలీ ఠాకూర్ విజయం సాధించారు. భాజపా తరఫున అలీనగర్ నియోజకవర్గం నుంచి పోటీచేసిన ఆమె.. సుమారు 12వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
ఇంటర్నెట్ డెస్క్: బిహార్ శాసనసభ ఎన్నికల్లో(Bihar Elections) స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచిన 25 ఏళ్ల మైథిలీ ఠాకూర్(Maithili Thakur) విజయం సాధించారు. జానపద గాయకురాలైన మైథిలీ.. తొలిసారిగా పోటీ చేసిన ఎన్నికల్లోనే సుమారు 12వేల మెజార్టీతో గెలుపొందడంతో ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు.
బిహార్‌లోని మిథిలాంచల్ ప్రాంతంలో కీలకమైన అలీనగర్ శాసనసభ స్థానం(Alinagar constituency) నుంచి భారతీయ జనతా పార్టీ(BJP) తరఫున తొలిసారి బరిలోకి దిగారు మైథిలీ. ఆ స్థానంలో ఆర్జేడీ తరఫున పోటీ చేసిన బినోద్ మిశ్రా నుంచి ఆమెకు గట్టి పోటీయే ఎదురైంది. మధ్యలో పలుమార్లు ఆధిక్యం తగ్గింది కూడా. అయినప్పటికీ కౌంటింగ్ పూర్తయ్యే సరికి ఆమె స్పష్టమైన ఆధిక్యం కనబరిచారు. ఆమెకు మెుత్తం 84,915 ఓట్లు రాగా.. 11,730 ఓట్ల మెజారిటీ సాధించారు. దీంతో బిహార్ అసెంబ్లీకి ఎన్నికైన అతి చిన్న వయస్కురాలిగా రికార్డు నెలకొల్పారు. అక్కడ మరో ప్రధాన పార్టీగా భావించిన.. ప్రశాంత్ కిశోర్ జన సురాజ్ పార్టీ కేవలం 2,200 పైచిలుకు ఓట్లకే పరిమితమై భారీ ఓటమిని చవిచూసింది.
మైథిలీ ఠాకూర్.. గతంలో బిహార్ ఎన్నికల కమిషన్ తరఫున 'స్టేట్ ఐకానిక్(State Iconic)'గా నియమితులయ్యారు. అప్పుడే అందరి దృష్టినీ తన వైపు తిప్పుకున్న మైథిలీ.. ఆ రాష్ట్ర సాంస్కృతిక అంబాసిడర్‌గానూ గుర్తింపు పొందారు. ఈమె జానపద సంగీతానికి చేసిన సేవలకు గానూ.. 2021లో ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్(Ustad Bismillah Khan) యువ పురస్కారంతో సంగీత నాటక అకాడమీ సత్కరించింది.
ఎన్డీయే విజయోత్సాహం.. పార్టీ ప్రధానకార్యాలయానికి మోదీ
బిహార్‌లో గెలుపు మాదే.. ఇక బెంగాల్‌లోనూ..: కేంద్ర మంత్రి
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి.