Share News

iPhone Price Drop: క్రేజీ డీల్.. ఐఫోన్‌పై రూ.16 వేల తగ్గింపు ఆఫర్..

ABN , Publish Date - May 14 , 2025 | 08:49 PM

మీరు తక్కువ ధరల్లో ఐఫోన్ కొనుగోలు చేయాలని చూస్తున్నారా. అయితే ఈ వార్త మీ కోసమే. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఐఫోన్ మోడల్‌పై ఏకంగా రూ.16 వేల తగ్గింపు ఆఫర్ ప్రకటించారు. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.

iPhone Price Drop: క్రేజీ డీల్.. ఐఫోన్‌పై రూ.16 వేల తగ్గింపు ఆఫర్..
iPhone 13 discount

మీరు బడ్జెట్ ధరల్లో ఐఫోన్ కొనుగోలు చేయాలని చూస్తున్నారా. అయితే మీకు గుడ్ న్యూస్. ఎందుకంటే ప్రస్తుతం అమెజాన్‌లో ఐఫోన్ 13పై రూ.16,000 తగ్గింపు ఆఫర్ లభిస్తోంది. ఇది కాకుండా బ్యాంక్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిని కలుపుకుంటే దీని ధర మరింత తగ్గనుంది. అయితే దీని అసలు ధర ఎంత, ఫీచర్లు ఎలా ఉన్నాయనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం పదండి.


చౌకగా ఐఫోన్..

ఐఫోన్ 13 అసలు ధర రూ. 59,900గా ఉంది. కానీ ప్రస్తుతం ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్‌లో దీనిని మీరు 26 శాతం తగ్గింపుతో కేవలం రూ. 43,900కు పొందవచ్చు. అంతేకాదు మీరు ఈ మొత్తాన్ని ఒకేసారి చెల్లించలేకపోతే EMI ఆప్షన్లు కూడా ఎంచుకునే సౌకర్యం ఉంది. దీన్ని నెలవారీ EMI రూ. 2,128కి కొనుగోలు చేయవచ్చు. బ్యాంక్ ఆఫర్లలో ఎంచుకున్న బ్యాంక్ క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లింపుపై మీరు రూ. 1,000 వరకు తగ్గింపు కూడా అదనంగా లభిస్తుంది.

ఎక్స్ఛేంజ్ ఆఫర్: మీరు ఎక్స్ఛేంజ్ ఆఫర్ ప్రయోజనాన్ని పొందినట్లయితే, మీ పాత ఫోన్‌కు బదులుగా మంచి డీల్ పొందవచ్చు. ఇది మీ కొత్త ఫోన్ ధరను చాలా వరకు తగ్గిస్తుంది. కానీ ఎక్స్ఛేంజ్ ఆఫర్ పూర్తి విలువ మీ పాత ఫోన్ బాడీ, మోడల్, బ్యాటరీపై ఆధారపడి ఉంటుంది.


ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..

iPhone 13లో అనేక ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. ఇది 6.1 అంగుళాల సూపర్ రిటినా XDR OLED డిస్ప్లేతో మంచి వీక్షణ అనుభవాన్ని అందిస్తుంది. అలాగే డ్యూయల్ కెమెరా సిస్టం 12MP వైడ్, 12MP అల్ట్రా వైడ్ కెమెరాలతో, నైట్ మోడ్ వంటి ఫోటోగ్రఫీ ఫీచర్లతో వస్తుంది. ఈ కెమెరా 4K HDR వీడియో (60fps వరకు), సినిమాటిక్ మోడ్ (1080p @30fps)ని రికార్డ్ చేస్తుంది. ఈ ఫోన్‌లో 5G కనెక్టివిటీ, ఐఓఎస్ 15 సిస్టమ్, Face ID వంటి ఫీచర్లు వినియోగదారులకు కొత్త అనుభవాన్ని అందిస్తాయి.


బ్యాటరీ లైఫ్..

కొత్త బ్యాటరీ లైఫ్ యూజర్‌కు 19 గంటల వీడియో ప్లేబ్యాక్ సమయం ఇస్తుంది. అలాగే ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్, 30 నిమిషాల్లో 50% ఛార్జ్ చేసేందుకు సహాయపడుతుంది. iPhone 13 కొత్త డిజైన్‌లో IP68 వాటర్, డస్ట్ రెసిస్టెంట్ రేటింగ్‌ సౌకర్యాలు ఉన్నాయి. ఇది 128GB, 256GB, 512GB స్టోరేజ్ ఆప్షన్లతో యూజర్లకు మెరుగైన అనుభవాన్ని అందిస్తుంది. ఈ ఫోన్‌లో మీకు అనేక కలర్ ఆప్షన్లు ఉన్నాయి. దీని నుంచి మీరు నచ్చిన ఏ రంగునైనా ఎంచుకోవచ్చు.


ఇవి కూడా చదవండి

Penny Stock: ఈ స్టాక్‎పై రూ.4 లక్షల పెట్టుబడి..ఏడేళ్ల లోనే రూ.56 లక్షల లాభం..


Investment Tips: ఒకేసారి రూ.3.5 లక్షల పెట్టుబడి..కానీ వచ్చేది మాత్రం కోటి, ఎలాగంటే..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 14 , 2025 | 08:53 PM