AC Buying Tips: ఇన్వర్టర్ AC vs నాన్-ఇన్వర్టర్ AC.. రెండింటిలో ఏది బాగా కూల్ చేస్తుంది..
ABN , Publish Date - Apr 10 , 2025 | 06:48 PM
Difference Between Inverter AC and Non-Inverter AC: ఇన్వర్టర్ ఏసీ, నాన్-ఇన్వర్టర్ ఏసీ మోడళ్ల మధ్య తేడాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ విషయంపై అవగాహన లేకుండా కొనేటప్పుడు తప్పుడు ఏసీని ఎంపిక చేసుకుంటే అనుకున్నంత కూలింగ్ రాదు. కరెంటు కూడా విపరీతంగా ఖర్చయ్యి బిల్లు మోత మోగిపోతుంది.

Inverter AC vs Non-Inverter AC Comparison: వేసవి ప్రారంభమయ్యే ముందు నుంచే కూలర్లు, ఎయిర్ కండిషనర్ల (AC)లకు డిమాండ్ విపరీతంగా పెరుగుతుంది. మార్చి, ఏప్రిల్ నెలల్లో వేడి కాస్త తక్కువగా ఉంటుంది కాబట్టి.. ఈ సమయంలో కూలర్లతో సరిపెట్టుకోవచ్చు. కానీ, మేలో ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు ఎయిర్ కండిషనర్ తప్పనిసరి అవుతుంది. మీరు ఈ వేసవిలో కొత్త AC కొనేందుకు షాప్‌కు వెళ్లే చాలామందికి ఇన్వర్టర్ AC కొనాలా.. నాన్-ఇన్వర్టర్ ACని తీసుకోవాలా అనే సందిగ్ధత ఉంటుంది. మీరు అలాగే ఆలోచిస్తుంటే కింది సమాచారం ఆధారంగా కచ్చితమైన దాన్ని ఎంపిక చేసుకోండి. ఈ రెండు రకాల ఎయిర్ కండిషనర్ల మధ్య తేడాల గురించి మీకు కచ్చితంగా తెలియకపోతే సరైనదాన్ని ఎంచుకోలేరు.
ఇన్వర్టర్ ACలను ఇంట్లో ఇన్‌స్టాల్ చేసిన సాధారణ ఇన్వర్టర్‌తో నడపవచ్చని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ ఇందులో ఇసుమంత కూడా నిజం లేదు. "ఇన్వర్టర్" అనే పదం వాస్తవానికి ఈ యూనిట్లలో ఉపయోగించే ఒక నిర్దిష్ట సాంకేతికతను సూచిస్తుంది. ACని కొనుగోలు చేసేటప్పుడు శీతలీకరణ సామర్థ్యం, శక్తి వినియోగం వంటి అంశాలపై శ్రద్ధ చూపడం చాలా ముఖ్యం. తప్పుడు రకం ACని ఎంచుకోవడం వల్ల తగినంత చల్లదనం రాదు. అధిక విద్యుత్ బిల్లులు మాత్రం వస్తాయి.
ప్రస్తుతం మార్కెట్లో మీరు రెండు ప్రధాన రకాల AC లే కనిపిస్తాయి. ఒకటి ఇన్వర్టర్ ఏసీ, మరొకటి నాన్-ఇన్వర్టర్ ఏసీ. ఈ రెండింటిలో ఏ రకమైన ఎయిర్ కండిషనర్ బాగా పనిచేస్తుంది. డబ్బు ఆదా చేయడంలో సహాయపడుతుందో చూద్దాం.
ఇన్వర్టర్ ACలు అంటే ఏమిటి?
ఇన్వర్టర్ ACలు కంప్రెసర్ వేగాన్ని నియంత్రించే అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తాయి. మీరు ACని ఆన్ చేసినప్పుడు ఇది గదిని కావలసిన ఉష్ణోగ్రతకు తెచ్చి త్వరగా చల్లబరుస్తుంది; ఆ తర్వాత కంప్రెసర్‌ను ఆపివేయడానికి బదులుగా వేగాన్ని తగ్గిస్తుంది. ఈ విధానం వల్ల తక్కువ విద్యుత్తు వాడుతూ స్థిరమైన శీతలీకరణను అనుమతిస్తుంది. సరళంగా చెప్పాలంటే ఇన్వర్టర్ AC ఆన్, ఆఫ్ కాకుండా తక్కువ వేగంతో నడుస్తుంది. ఒక్కసారి గది కూల్ అయ్యాక ఆన్‌లో ఉన్నా వేగంగా పనిచేయకుండా ఒకేలాంటి చల్లదనం ఉండేలా చూస్తుంది.
నాన్-ఇన్వర్టర్ ACల సంగతేంటి?
నాన్-ఇన్వర్టర్ ACల్లో కంప్రెసర్ పూర్తి శక్తితోగానీ లేదా అస్సలు పనిచేయదు. మీరు మొదట దీన్ని ఆన్ చేసినప్పుడు గది కావలసిన ఉష్ణోగ్రతకు చేరుకునే వరకు కంప్రెసర్ నడుస్తుంది. తర్వాత ఆగిపోతుంది. ఉష్ణోగ్రత మళ్ళీ పెరగడం మొదలవగానే కంప్రెసర్ తిరిగి పనిచేస్తుంది. ఇలా పదే పదే ఆన్, ఆఫ్ అవుతూ పనిచేయడం వల్ల విద్యుత్ వినియోగం పెరుగుతుంది. తత్ఫలితంగా కరెంటు బిల్లులు భారీగా పెరుగుతాయి.
శీతలీకరణ సామర్థ్యం విషయానికి వస్తే ఇన్వర్టర్ ACలు పైచేయి సాధిస్తాయి. గది తగినంత చల్లగా ఉన్నప్పటికీ వాటి కంప్రెసర్‌లు పనిచేస్తాయి. చల్లని గాలి స్థిరంగా ప్రవహిస్తుంది. దీనికి విరుద్ధంగా ఇన్వర్టర్ కాని ACలు గదిని త్వరగా చల్లబరుస్తాయి కానీ వాటి స్థిరమైన ఆన్-అండ్-ఆఫ్ సైక్లింగ్ కారణంగా తరచుగా ఉష్ణోగ్రతలో హెచ్చుతగ్గులు ఏర్పడతాయి. అందువల్ల, విద్యుత్ బిల్లులను ఆదా చేయడం, స్థిరమైన ఉష్ణోగ్రతను నిర్వహించడం మీ లక్ష్యం అయితే.. ఇన్వర్టర్ ACని ఎంచుకోవడం తెలివైన ఎంపిక.
Read also: AI Image Generation: యువకుడి నుంచి ఫ్లాష్‌ఫార్వర్డ్.. 2075లో ఎలా కనిపిస్తానో తెలుసా..
WhatsApp: వాట్సాప్ యూజర్లకు హెచ్చరిక.. సైబర్ అటాక్‌కు అవకాశం..
WhatsApp New Update: కొత్త ఫీచర్.. మీరు పంపిన ఫొటోలు, వీడియోలు ఇకపై సేవ్ అవ్వవు..