Share News

Shoaib Akhtar: షోయబ్ అక్తర్ యూట్యూబ్ ఛానెల్‌పై నిషేధం..అంతేకాదు..

ABN , Publish Date - Apr 28 , 2025 | 12:08 PM

పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య పరిస్థితులు మరింత కఠినంగా మారుతున్నాయి. ఇప్పటికే అనేక చర్యలు తీసుకున్న భారత ప్రభుత్వం, తాజాగా పాకిస్తాన్‌కు చెందిన 16 యూట్యూబ్ ఛానెళ్లను నిషేధించింది. వీటిలో మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ ఛానెల్‌ కూడా ఉంది.

Shoaib Akhtar: షోయబ్ అక్తర్ యూట్యూబ్ ఛానెల్‌పై నిషేధం..అంతేకాదు..
Shoaib Akhtar YouTube Channel

కశ్మీర్ పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, భారత ప్రభుత్వం పాకిస్తాన్‌పై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూనే ఉంది. ఇప్పటికే ఇండియాలో ఉన్న పాకిస్తాన్ పౌరులను వారి దేశానికి ఏప్రిల్ 27లోగా వెళ్లాలని ఆదేశించింది. దీంతోపాటు ఆ దేశ పౌరులకు వీసాలను కూడా రద్దు చేసింది. ఈ క్రమంలోనే తాజాగా పాకిస్తాన్‌కు చెందిన 16 యూట్యూబ్ ఛానెళ్లపై భారత్ నిషేధం విధించింది. బ్యాన్ చేసిన వాటిలో మాజీ ప్రముఖ క్రికెటర్ షోయబ్ అక్తర్ యూట్యూబ్ ఛానల్‌ సహా పాకిస్తాన్ మీడియాకు చెందిన పలు ఛానెళ్లు ఉన్నాయి.


బ్లాక్ చేసినట్లు

ప్రభుత్వం ఈ చర్య తీసుకున్న తర్వాత, షోయబ్ అక్తర్‌తో సహా నిషేధించబడిన అన్ని యూట్యూబ్ ఛానెల్‌లను తెరిచిన తర్వాత బ్లాక్ చేసినట్లు మెసేజ్ కనిపిస్తోంది. జాతీయ భద్రత లేదా ప్రభుత్వ ఆదేశాల కారణంగా ఈ కంటెంట్ ప్రస్తుతం ఈ దేశంలో అందుబాటులో లేదని చూపిస్తుంది. షోయబ్ అక్తర్, అర్జూ కజ్మీ, సయ్యద్ ముజమ్మిల్ షా వంటి పాకిస్తానీ ప్రముఖులతో పాటు, భారత ప్రభుత్వం భారతదేశంలో ప్రధాన పాకిస్తానీ మీడియా ఛానెళ్లను కూడా నిషేధించింది. ఇందులో డాన్ న్యూస్, సమ్మా టీవీ, ఆరీ న్యూస్, జియో న్యూస్, జీఎన్ఎన్, బోల్ న్యూస్ మొదలైన యూట్యూబ్ ఛానెల్‌లు ఉన్నాయి.


పహల్గామ్ ఉగ్రవాద దాడికి పాకిస్తాన్‌తో సంబంధం

జమ్మూ కశ్మీర్‌లో పహల్గామ్ ఉగ్రవాద ఘటన నేపథ్యంలో భారతదేశం, భద్రతా సంస్థలకు వ్యతిరేకంగా రెచ్చగొట్టే మతపరమైన కంటెంట్, తప్పుదారి పట్టించే యూట్యూబ్ ఛానెళ్లను భారత ప్రభుత్వం బ్యాన్ చేసింది. ఏప్రిల్ 22, 2025న, పహల్గామ్‌లో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఇందులో 25 మందికిపైగా పర్యాటకులు మరణించారు. ఈ ఉగ్రవాదులు ది రెసిస్టెన్స్ ఫోర్స్‌తో సంబంధం కలిగి ఉన్నారని వెలుగులోకి వచ్చింది. జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేయడానికి హఫీజ్ సయీద్ ఈ సంస్థను స్థాపించాడు. వారికి పాకిస్తాన్ సైన్యం నుంచి కూడా మద్దతు లభిస్తుందని తెలిసింది.


ఇవి కూడా చదవండి:

NaBFIDలో అనలిస్టు పోస్టులకు నోటిఫికేషన్.. రూ.14 లక్షల జీతంతో మంచి ఛాన్స్

India Pakistan: భారత్ నుంచి పాకిస్తాన్‌కు 4 రోజుల్లో 537 మంది ప్రయాణం

Pakistan Citizens: భారత్ విడిచి వెళ్లని పాకిస్తానీలకు మూడేళ్ల జైలు శిక్ష, రూ.3 లక్షల జరిమానా


Akshay Tritiya: అక్షయ తృతీయకు గోల్డ్ కొనలా..వెయిట్ చేయాలా


Bank Holidays: మే 2025లో 12 రోజులు బ్యాంకులు బంద్.. పూర్తి లిస్ట్ ఇదే

Read More Business News and Latest Telugu News

Updated Date - Apr 28 , 2025 | 12:16 PM