Yuzvendra Chahal: ధనశ్రీపై చాహల్ సంచలన వ్యాఖ్యలు..విడాకులపై తొలిసారి స్పందన
ABN , Publish Date - Aug 02 , 2025 | 10:36 AM
తన స్పిన్ బౌలింగ్‌తో అభిమానులను మంత్ర ముగ్ధులను చేసిన యుజ్వేంద్ర చాహల్ తాజాగా తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

భారత క్రికెట్ టీమ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ (Yuzvendra Chahal) తన మాజీ భార్య, కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ(Dhanashree Verma)తో సంబంధం గురించి ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో మొదటిసారి ఓపెన్‌గా మాట్లాడాడు. ఈ జంట మార్చి 2025లో ముంబై ఫ్యామిలీ కోర్టు నుంచి విడాకులు పొందారు. 2020 డిసెంబర్‌లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. కానీ 2022 జూన్‌లోనే విడిపోయారు.
మాట్లాడే సమయంలో
చాహల్ ఓ యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ తాను ధనశ్రీతో చాలా కాలంగా మాట్లాడలేదని, టెక్స్ట్ చేయలేదని చెప్పాడు. 2024 టీ20 వరల్డ్ కప్ తర్వాత వీరి మధ్య సంభాషణలు కేవలం అధికారికమైనవి మాత్రమే అయ్యాయట. చాలా రోజుల తర్వాత ఆమెను వీడియో కాల్‌లో చూసినట్లు తెలిపాడు. అది కూడా లాయర్లు మాట్లాడే సమయంలో.
ఆ తర్వాత ఎలాంటి మెసేజ్ లేదా కాల్ లేదన్నాడు. విడాకులకు ముందు ఆరు ఏడు నెలలు మేం మాట్లాడుకోలేదు. చాలా ముఖ్యమైన విషయం ఉంటేనే మాట్లాడేవాళ్లం, లేకపోతే ఏమీ లేదు. టీ20 వరల్డ్ కప్ తర్వాత నుంచి అది పూర్తిగా మారిపోయిందని చాహల్ వెల్లడించాడు.
కాపాడుకునే అవకాశం ఉందా..
విడాకుల గురించి ఎవరు మొదట మాట్లాడారని అడిగితే, చాహల్ ఇలా అన్నాడు. కొన్నిసార్లు ఆమె దాని గురించి మాట్లాడేది. కొన్నిసార్లు నేను. ఒక రోజు ఇద్దరం కలిసి ఆ నిర్ణయం తీసుకున్నాం. సంబంధాన్ని కాపాడుకునే అవకాశం ఉందా అని అడిగితే, లేదు, మేం చాలా ప్రయత్నించాం. నేను నా వంతు పూర్తిగా చేశానని చాహల్ చెప్పాడు.
ఈ దశలో చాహల్ తన మానసిక ఆరోగ్య సమస్యల గురించి కూడా ఓపెన్‌గా మాట్లాడాడు. తనపై ఎన్నో పుకార్లు వచ్చినా, తాను ధనశ్రీని ఎప్పుడూ మోసం చేయలేదని స్పష్టం చేశాడు. నేను ఎప్పుడూ ఆమెను చీట్ చేయలేదన్నాడు. అలాంటి పుకార్లు ఎన్ని వచ్చినా అవి నిజం కాదని చాహల్ స్పష్టం చేశాడు.
పరిస్థితి వేరేలా ఉండేది..
వీరిద్దరూ విడిపోవడం గురించి మొదట ప్రపంచానికి చెప్పకుండా రహస్యంగా ఉంచారు. కానీ, దాన్ని బయటకు చెప్పకూడదని నిర్ణయించుకున్నారు. ఒకవేళ విడాకులు ఆగిపోతే, పరిస్థితి వేరేలా ఉండేది కదా. అందుకే, అంతా ఖరారు అయ్యే వరకు ఏమీ చెప్పకూడదని, సోషల్ మీడియాలో సాధారణ జంటలా కనిపిద్దామని అనుకున్నామని చాహల్ వివరించాడు.
ఈ విడాకులు చాహల్ అభిమానులకు షాక్ ఇచ్చాయి. ఒకప్పుడు సోషల్ మీడియాలో అందమైన జంటగా కనిపించిన వీరు, ఇప్పుడు విడిపోవడం చాలా మందిని ఆలోచనలో పడేసింది. చాహల్ మాత్రం ప్రస్తుతం తన కెరీర్‌పై ఫోకస్ చేస్తూ, ఈ పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొన్నాడు.
ఇవి కూడా చదవండి
ఇలా ఇన్వెస్ట్ చేయండి..రెండేళ్లలోనే రూ. 10 లక్షలు పొందండి..
ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి