Yograj Singh: 'చచ్చిపోవాలని ఉంది'.. యువరాజ్ సింగ్ తండ్రి సంచలన కామెంట్స్
ABN , Publish Date - Nov 17 , 2025 | 06:56 PM
చనిపోవాలని ఉందంటూ టీమిండియా మాజీ క్రికెటర్ల యువరాజ్ సింగ్ తండ్రి యోగ్ రాజ్ సంచలన కామెంట్స్ చేశారు. ఒంటరితనం భరించలేకపోతున్నానని ఆయన వాపోయారు.
టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్(Yuvraj Singh) తండ్రి యోగ్ రాజ్ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తన కొడుకు క్రికెట్ కెరీర్ కు సంబంధించిన విషయాలను ప్రస్తావిస్తూ... తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా ఆయన చేసిన కామెంట్స్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఒంటరి జీవితం నరకంగా ఉందని, తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తున్నానని, చావడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపాడు. తాను ప్రేమించిన వారంతా దూరమయ్యారని ఆవేదన వ్యక్తం చేశాడు. తన జీవితంలో సాధించాల్సింది, అనుభవించేది ఏది లేదని తాజాగా ఓ ఇంటర్వ్యూలో యోగ్‌రాజ్ సింగ్(Yograj Singh interview) వెల్లడించారు.
62 ఏళ్ల యోగ్ రాజ్(Yograj Singh) ఓ ఇంటర్యూలో మాట్లాడుతూ..' రోజూ సాయంత్రం ఇంట్లో నేను ఒంటరిగా కూర్చుంటాను. తిండి కోసం ఇతరులపై ఆధారపడుతున్నాను. ఆహారం కోసం నేను ఎవర్నీ ఇబ్బంది పెట్టను. నాకు ఆకలిగా ఉన్నప్పుడు మాత్రం ఎవరో ఒకరు ఆహారం అందిస్తారు. నా వంట కోసం పనివారిని పెట్టుకున్నా... వారు వారి పని చేసుకొని వెళ్లి పోతారు. నాకు మనవళ్లతో సహా కుటుంబంలోని ప్రతీ ఒక్కరితో కలిసి ఉండాలని ఉంది. ఎందుకో తెలియదు.. అందరూ నన్ను వదిలి దూరంగా ఉంటున్నారు. జీవితంపై విరక్తి వస్తుంది. అందుకే నేను చావడానికి సిద్ధంగా ఉన్నాను. దేవుడు ఎప్పుడు కోరుకుంటే అప్పుడు నన్ను తీసుకెళ్లవచ్చు' అని తెలిపాడు.
అదే నాకు అతిపెద్ద షాక్..
ఆయన ఇంకా మాట్లాడుతూ..'యువరాజ్ సింగ్, అతని తల్లి షబ్నమ్ కౌర్(Shabnam Kaur) నన్ను విడిచి వెళ్లడం నా జీవితంలోనే అతి పెద్ద షాక్. నా జీవితం ఎవరి కోసం అంకితం చేశానో.. ఆమె నన్ను వదిలి వెళ్లిపోయింది. నేను అందర్నీ బాగా చూసుకున్నప్పుడు నాకే ఇలా ఎందుకు జరుగుతుందని ఆ దేవుడిని అడిగాను. నేను కొన్ని తప్పులు చేసి ఉండచ్చు. కానీ ఎవరికీ కీడు మాత్రం చేయలేదు. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు చూశాను. కానీ వృద్ధాప్యంలో నాకు ఎవరూ తోడుగా లేరు. నేను ఎక్కడ మొదలు పెట్టానో అక్కడికే వచ్చాను. ఇలా ఎందుకు చేశానా? అని నన్ను నేను ప్రశ్నించుకుంటున్నా. నాకు ఇలా జరగాల్సిందేలే 'అని యోగ్ రాజ్ సింగ్ (Yograj Singh emotional statements)పేర్కొన్నాడు.
షబ్నమ్ కౌర్( Shabnam Kau)ను యోగ్ రాజ్ సింగ్ తొలి వివాహం చేసుకోగా.. వారికి యువరాజ్ సింగ్, జోరవర్ పుట్టారు. అయితే తరుచూ గొడవలు జరగడంతో ఈ ఇద్దరూ విడిపోయారు. యువరాజ్ సింగ్, అతడి తల్లి షబ్నమ్ కౌర్ ..యోగ్ రాజ్ కు దూరంగా ఉంటున్నారు. ఆ తర్వాత యోగ్ రాజ్ సింగ్ నీనా బంధెల్ అలియాస్ సత్బీర్ కౌర్‌ను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఒక అమ్మాయి, అబ్బాయి పుట్టారు. ఏమైందో ఏమో తెలియదు.. కానీ వీరు కూడా యోగ్‌రాజ్ సింగ్‌తో ఉండటం లేదు. వారు అమెరికాలో ఉంటున్నారు.
ఇవి కూడా చదవండి:
Temba Bavuma: చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా కెప్టెన్ బవుమా
Ruturaj Gaikwad Creates Record: రుతురాజ్ గైక్వాడ్ అరుదైన రికార్డు
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి