West Indies Beats Bangladesh: బంగ్లాపై వెస్టిండీస్ ఘన విజయం
ABN , Publish Date - Oct 28 , 2025 | 10:17 AM
బంగ్లాదేశ్ తో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో 16 పరుగుల తేడా వెస్టిండీస్ విజయం సాధించింది. చట్టోగ్రామ్ వేదికగా నిన్న (సోమవారం) బంగ్లా, విండీస్ మధ్య తొలి టీ 20 మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన కరేబియన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది.
చట్టోగ్రామ్, అక్టోబర్ 28: బంగ్లాదేశ్ తో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో 16 పరుగుల తేడా వెస్టిండీస్(West Indies vs Bangladesh) విజయం సాధించింది. చట్టోగ్రామ్ వేదికగా నిన్న (సోమవారం) బంగ్లా, విండీస్ మధ్య తొలి టీ 20 మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన కరేబియన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. షాయ్ హోప్ (46*)(Shai Hope), రోవ్‌మన్ పావెల్ (44*), అలిక్ అథనాజ్ (34), బ్రాండన్ కింగ్ (33) రాణించారు. షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ పరుగు ఖాతా ఓపెన్ చేయకుండానే పెవిలియన్ చేరాడు. ఇక బంగ్లా బౌలర్లలో తస్కిన్ అహ్మద్ రెండు, రిషద్ హొస్సేన్ ఒక వికెట్ తీశారు.
అనంతరం 166 పరుగుల టార్గెట్ ను ఛేదించే క్రమంలో బంగ్లాదేశ్(Bangladesh cricket) ఓ మోస్తరు పోరాటం చేసి చేతులెత్తేసింది. దీంతో 19.4 ఓవర్లలో 149 పరుగులకు ఆలౌటైంది. తంజిమ్ హసన్ (33), తౌహిద్ హృదోయ్ (28), నసుమ్ అహ్మద్ (20) ఓ మోస్తరు ఇన్నింగ్స్‌లు ఆడారు. స్టార్ బ్యాటర్, కెప్టెన్ అయిన లిట్టన్ దాస్ 5 పరుగులకే ఔటయ్యాడు. వెస్టిండీస్ బౌలర్లలో జేడన్ సీల్స్(Jaden Seales), జేసన్ హోల్డర్ (Jason Holder)తలో 3 వికెట్లు తీశారు. అకీల్ హొసేన్ 2, ఖారీ పియెర్, రొమారియో షెపర్డ్ తలో వికెట్ పడగొట్టారు.
బంగ్లాదేశ్ , వెస్టిండీస్ మధ్య మూడు మ్యాచుల టీ20 సిరీస్ జరుగుతుంది. ఈ సిరీస్‌లోని రెండో టీ20 కూడా చట్టోగ్రామ్( Chattogram match) వేదికగా అక్టోబర్ 29న జరుగనుంది. కాగా, ఇరు జట్ల మధ్య ఇటీవల ముగిసిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను బంగ్లాదేశ్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. మొదటి, మూడు మ్యాచ్‌ల్లో బంగ్లాదేశ్ గెలిచింది. రెండో వన్డేలో వెస్టిండీస్ సూపర్ ఓవర్లో విజయం సాధించింది. ప్రస్తుతం వెస్టిండీస్ జట్టు బంగ్లాదేశ్‌లో పర్యటిస్తుంది.
ఇవి కూడా చదవండి..
Election Commission Announced: తమిళనాడు, బెంగాల్లో ఎస్ఐఆర్
Yashasvi Jaiswal Key Decision: యశస్వి జైస్వాల్ సంచలన నిర్ణయం