Virat Kohli: అరుదైన రికార్డుకు అడుగు దూరంలో కోహ్లీ!
ABN , Publish Date - Oct 17 , 2025 | 03:10 PM
ఆదివారం పెర్త్ వేదికగా జరిగే తొలి వన్డేలో కోహ్లీ సెంచరీ చేస్తే.. ఈ అరుదైన రికార్డ్ తన ఖాతాలో పడనుంది. ప్రస్తుతం ఈ జాబితాలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఉన్నారు.
ఆస్ట్రేలియా పర్యటనకు ముందు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని ఆల్‌టైమ్ రికార్డ్ ఊరిస్తోంది. ఆదివారం(అక్టోబర్ 19) నుంచి ఆసీస్ తో ప్రారంభమయ్యే మూడు వన్డేల సిరీస్‌లో కోహ్లీ సెంచరీ సాధిస్తే ఇంటర్నేషనల్ క్రికెట్‌లో ఒక ఫార్మాట్‌లో అత్యధిక శతకాలు చేసిన బ్యాటర్‌గా చరిత్ర సృష్టిస్తాడు. ఇప్పటికే ఈ రికార్డ్‌ను సమం చేసిన కోహ్లీ.. అధిగమించేందుకు ఒక్క సెంచరీ దూరంలో ఉన్నాడు.
ఆదివారం పెర్త్ వేదికగా జరిగే తొలి వన్డేలో కోహ్లీ సెంచరీ చేస్తే.. ఈ అరుదైన రికార్డ్(Virat Kohli Century Record) తన ఖాతాలో పడనుంది. ప్రస్తుతం ఈ జాబితాలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar) ఉన్నాడు. అతను టెస్ట్‌ల్లో 51 సెంచరీలతో టాప్‌లో ఉండగా విరాట్ కోహ్లీ.. 51 వన్డే సెంచరీలతో ఈ రికార్డ్‌ను సమం చేశాడు. ఆ తర్వాత సచిన్ వన్డేల్లో 49, జాక్వస్ కల్లీస్ టెస్ట్‌ల్లో 45 , రికీ పాంటింగ్ టెస్టుల్లో 41 శతకాలతో కొనసాగుతున్నారు.
అయితే మూడు ఫార్మాట్లలో మాత్రం 100 సెంచరీలతో సచిన్ టాప్ ప్లేసులో ఉన్నాడు. ఆ తర్వాత 82 సెంచరీలతో కోహ్లీ(Virat Kohli) రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఆసీస్ తో జరిగే వన్డే సిరీస్‌లో కోహ్లీ సెంచరీ చేస్తే.. ఆస్ట్రేలియా గడ్డపై అత్యధిక సెంచరీలు చేసిన విదేశీ బ్యాటర్‌గా విరాట్ నిలుస్తాడు. ఆస్ట్రేలియా గడ్డపై(Kohli Australia Records) ఆ దేశంతో 5 శతకాలతో శ్రీలంక మాజీ క్రికెటర్ కుమార సంగక్కర, హిట్ మ్యాన్ రోహిత్ శర్మతో కోహ్లి సమంగా ఉన్నాడు. మరో సెంచరీ చేస్తే వారిని కోహ్లీ అధిగమిస్తాడు.
ఇవి కూడా చదవండి
ఇలా అనడం సిగ్గు చేటు.. మాజీ క్రికెటర్‌పై మండిపడ్డ గౌతమ్ గంభీర్
Vaibhav Suryavanshi: వైభవ్ మరో చరిత్ర
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి