Virat Kohli: సచిన్ రికార్డ్ బ్రేక్ చేసిన విరాట్ కోహ్లీ.. అత్యంత వేగంగా 14 వేల పరుగులు
ABN , Publish Date - Feb 23 , 2025 | 09:21 PM
టీమిండియా రన్ మిషన్ విరాట్ కోహ్లీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచులో సరికొత్త రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో విరాట్.. దిగ్గజ ప్లేయర్ సచిన్ టెండూల్కర్ రికార్డ్ బ్రేక్ చేయడం విశేషం. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.

ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచులో టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ (Virat Kohli) అరుదైన ఘనతను సాధించాడు. ఈ క్రమంలో అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో అత్యంత వేగంగా 14 వేల పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు. ఈ రికార్డ్ సాధించడం ద్వారా సచిన్ టెండూల్కర్, కుమార సంగక్కర వంటి దిగ్గజాలను వెనక్కి నెట్టి కోహ్లీ తన స్థాయిని మరింత పెంచుకున్నాడు.
ఈ రికార్డ్ సాధించడానికి విరాట్ కోహ్లీ 299 వన్డే మ్యాచ్‌లలో 287 ఇన్నింగ్స్‌లు ఆడాడు. తక్కువ ఇన్నింగ్స్‌లలో కోహ్లీ అత్యంత వేగంగా 14 వేల పరుగులు చేయడం విశేషం. ఇక సచిన్ టెండూల్కర్ 14 వేల పరుగులు పూర్తి చేయడానికి 350 ఇన్నింగ్స్‌లు, కుమార సంగక్కర 378 ఇన్నింగ్స్‌లు తీసుకున్నారు.
విరాట్ పేరిట మరో రికార్డ్
విరాట్ కోహ్లీ ఈ రికార్డును పాకిస్తా్న్‌తో జరిగిన మ్యాచ్‌లో 15 పరుగులు చేసిన తర్వాత తన పేరిట ఈ రికార్డు లిఖించుకున్నాడు. అంతేకాదు ఈ మ్యాచ్‌లో విరాట్ కేవలం 14 వేల పరుగుల మైలురాయిని చేరుకోవడమే కాకుండా, భారత్ తరఫున వన్డేల్లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఫీల్డర్‌గా కూడా నిలిచాడు. ఈ క్రమంలో మహ్మద్ అజారుద్దీన్ 25 ఏళ్ల రికార్డును బ్రేక్ చేశాడు. అజారుద్దీన్ 156 క్యాచ్‌లు అందుకోగా, తాజాగా కోహ్లీ 158 క్యాచ్‌లు అందుకుని ఆ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.
మహ్మద్ అజారుద్దీన్ - 156 క్యాచ్‌లు
సచిన్ టెండూల్కర్ - 140 క్యాచ్‌లు
రాహుల్ ద్రవిడ్ - 124 క్యాచ్‌లు
సురేష్ రైనా - 102 క్యాచ్‌లు
ఇంకా మరిన్ని రికార్డులు..
కోహ్లీ వన్డే కెరీర్‌ను పరిశీలిస్తే 299 మ్యాచ్‌లలో 287 ఇన్నింగ్స్‌లలో కోహ్లీ 57.79 అద్భుతమైన సగటుతో 14001 పరుగులు చేశాడు. ఈ సమయంలో విరాట్ 51 సెంచరీలు, 73 అర్ధ సెంచరీలు చేశాడు. వన్డేల్లో కోహ్లీ అత్యధిక స్కోరు 183 పరుగులు. ఇది శ్రీలంకపై నమోదు చేశాడు. ఈ రికార్డ్ పట్ల క్రీడాభిమానులతోపాటు పలువురు క్రికెటర్లు కూడా సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలియజేస్తు్న్నారు. అంతేకాదు విరాట్ తన కెరీర్‌లో ఇంకా ఎన్నో రికార్డులను సాధిస్తారని క్రీడా నిపుణులు భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
VIP Darshan: 3 రోజులు వీఐపీ దర్శనాలు బంద్.. మహాశివరాత్రి వేళ కీలక నిర్ణయం..
Russia Ukraine War: రష్యా, ఉక్రెయిన్ యుద్ధానికి మూడేళ్లు.. మళ్లీ దాడులు షురూ..
Pakistan Bangladesh: 54 ఏళ్ల తర్వాత పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య ప్రత్యక్ష వాణిజ్యం పునఃప్రారంభం
Viral Video: ప్రధాని మోదీ, ట్రంప్‌ని మెచ్చుకున్న మహిళా ప్రధాని.. వారిపై విమర్శలు..
Upcoming IPOs: పెట్టుబడిదారులకు అలర్ట్.. వచ్చే వారం రానున్న ఐపీఓలు ఇవే..
Bank Holidays: మార్చి 2025లో బ్యాంకు సెలవులు.. ఈసారి ఎన్ని రోజులంటే..
Aadhaar Update: అలర్ట్.. ఆధార్‌లో మీ నంబర్, పేరు, అడ్రస్ ఎన్నిసార్లు మార్చుకోవచ్చో తెలుసా..
Read More Business News and Latest Telugu News