Share News

Pro Kabaddi: తెలుగు టైటాన్స్‌ చేతిలో బెంగళూరు ఓటమి

ABN , Publish Date - Oct 27 , 2025 | 09:30 AM

తెలుగు టైటాన్స్‌ ఎలిమినేటర్‌కు అర్హత సాధించింది. నిన్న(ఆదివారం) జరిగిన ఆటలో తెలుగు టైటాన్స్ 37-32తో బెంగళూరు బుల్స్‌ను ఓడించింది. ఈ పోరులో ఆరంభం నుంచి రెండు జట్లు నువ్వానేనా అన్నట్లు తలపడ్డాయి. బ్రేక్ టైమ్ కు టైటాన్స్‌ 16-14 ఆధిక్యంలో నిలిచింది.

Pro Kabaddi: తెలుగు టైటాన్స్‌ చేతిలో బెంగళూరు ఓటమి

క్రీడా న్యూస్: ప్రొ కబడ్డీ సీజన్‌-12(Pro Kabaddi Season 12)చివరి దశకు చేరుకుంది. ఈ క్రమంలోనే తెలుగు టైటాన్స్‌(Telugu Titans) ఎలిమినేటర్‌కు అర్హత సాధించింది. నిన్న(ఆదివారం) జరిగిన ఆటలో తెలుగు టైటాన్స్ 37-32తో బెంగళూరు బుల్స్‌ను ఓడించింది. ఈ పోరులో ఆరంభం నుంచి రెండు జట్లు నువ్వానేనా అన్నట్లు తలపడ్డాయి. బ్రేక్ టైమ్ కు టైటాన్స్‌ 16-14 ఆధిక్యంలో నిలిచింది. రెండో అర్ధంలోనూ బెంగళూరు బుల్స్(Bengaluru Bulls) నుంచి టైటాన్స్‌కు గట్టిపోటీ ఎదురైంది. ఒకానొదశలో టైటాన్స్ ఒత్తిడికి గురైంది.


ఒత్తిడిని అధికమించిన టైటాన్స్‌ చివరకు స్వల్ప పాయింట్ల తేడాతో విజయాన్ని సొంతం చేసుకుంది. భరత్‌ (12), కెప్టెన్‌ విజయ్‌ మలిక్‌ (10) టైటాన్స్ జట్టు తరఫున సత్తా చాటారు. ఈ విజయంతో టైటాన్స్‌ ఎలిమినేటర్‌-3 ఆడే ఛాన్స్ దక్కించుకుంది. మరోవైపు పోరులో పాట్నా పైరేట్స్‌(Patna Pirates) ఎలిమినేటర్‌-2కు అర్హత సాధించింది. ఆ జట్టు 48-32 పాయింట్లతో జైపుర్‌ పింక్‌ పాంథర్స్‌ను ఓడించింది. మొదటి నుంచి దూకుడుగా ఆడిన పాట్నా బ్రేక్ టైమ్ కు 30-13తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది. బ్రేక్‌ తర్వాతా జోరు కొనసాగించి పాట్న ఘన విజయాన్ని అందుకుంది. ఏ దశలోనూ జైపుర్(Jaipur Pink Panthers)..పాట్నాకు గట్టిపోటీ ఇవ్వలేకపోయింది.


ఇవీ చదవండి:

నవంబరు 1 నుంచి బ్యాంకుల్లో వచ్చే మార్పులివే..

హైదరాబాద్‌ యాపిల్‌ ఎయిర్‌పాడ్స్‌ తయారీ హబ్‌

South China Sea Crash: దక్షిణ చైనా సముద్రంలో కూలిన అమెరికా నావికా విమానం, హెలికాఫ్టర్

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Oct 27 , 2025 | 09:30 AM