Share News

Suryakumar Yadav: చరిత్ర సృష్టించిన సూర్యకుమార్ యాదవ్..పదేళ్ల ఐపీఎల్ రికార్డ్ బ్రేక్

ABN , Publish Date - May 02 , 2025 | 12:05 PM

IPL 2025లో సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) విధ్వంసక ప్రదర్శన కొనసాగుతోంది. జైపూర్‌లో రాజస్థాన్‌ జట్టుపై 23 బంతుల్లో 48 పరుగులు చేసి సూర్య సరికొత్త రికార్డ్ సృష్టించాడు. ఈ క్రమంలో 10 ఏళ్ల నాటి ఐపీఎల్ రికార్డును బ్రేక్ చేశాడు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.

Suryakumar Yadav: చరిత్ర సృష్టించిన సూర్యకుమార్ యాదవ్..పదేళ్ల ఐపీఎల్ రికార్డ్ బ్రేక్
Suryakumar Yadav

ఐపీఎల్ 2025లో సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) తాజాగా సరికొత్త రికార్డ్ సృష్టించాడు. ముంబై ఇండియన్స్‌ తరఫున ఆడుతున్న సూర్యకుమార్ వరుసగా 11 ఇన్నింగ్స్‌లలో 25 కంటే ఎక్కువ పరుగులు చేసి అరుదైన ఘనతను దక్కించుకున్నాడు. అంతకుముందు ఈ రికార్డు 2014లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున అడిన రాబిన్ ఉతప్ప పేరిట ఉండేది. అతను 10 ఇన్నింగ్స్‌లలో ఈ ఘనత సాధించాడు. ఈ క్రమంలో తాజాగా సూర్యకుమార్ యాదవ్ సాయి సుదర్శన్‌ను వెనక్కినెట్టి ఆరెంజ్ క్యాప్ రేసులో అగ్రస్థానానికి చేరుకున్నాడు.


మొదట రోహిత్ శర్మతో

జైపూర్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో, ర్యాన్ రికెల్టన్ ఔట్ అయిన తర్వాత సూర్యకుమార్ (Suryakumar Yadav) క్రీజులోకి వచ్చి మొదట రోహిత్ శర్మతో, ఆ తర్వాత హార్దిక్ పాండ్యాతో కలిసి 23 బంతుల్లో 48 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ అర్ధ సెంచరీని కోల్పోయినప్పటికీ, మరోసారి అద్భుతంగా బ్యాటింగ్ చేయడం ద్వారా తన జట్టును 200 దాటించడంలో కీలక పాత్ర పోషించాడు. IPL 2025లో సూర్యకుమార్ యాదవ్ ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌లలో 29, 48, 27*, 67, 28, 40, 26, 68*, 40*, 54, 48* పరుగులు చేశాడు. అతని అద్భుతమైన నిలకడ కారణంగానే లీగ్ దశలో 50 మ్యాచ్‌లు పూర్తి చేసిన తర్వాత ఆరెంజ్ క్యాపులో టాప్‎లోకి చేరాడు.


ఐపీఎల్‌లో వరుసగా అత్యధికంగా 25+ పరుగులు చేసిన ఆటగాళ్లు

  • 11 ఇన్నింగ్స్‌లు – సూర్యకుమార్ యాదవ్ (2025)*

  • 10 ఇన్నింగ్స్‌లు – రాబిన్ ఉతప్ప (2014)

  • 9 ఇన్నింగ్స్‌లు – విరాట్ కోహ్లీ (2024–25)

  • 9 ఇన్నింగ్స్‌లు – స్టీవ్ స్మిత్ (2016–17)

  • 9 ఇన్నింగ్స్‌లు – సాయి సుదర్శన్ (2023–24)


మరిన్ని రికార్డులు

ఈ సీజన్‌లో సూర్య 67.85 సగటుతో 172.72 ఫాస్ట్ స్ట్రైక్ రేట్‌తో 475 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతను 46 ఫోర్లు, 26 సిక్సర్లు కొట్టాడు. ఇదే ప్రదర్శన కొనసాగిస్తే, ఈ సీజన్ చివరి నాటికి అతను మరిన్ని రికార్డులు క్రియేట్ చేసే ఛాన్సుంది. దీంతోపాటు ముంబై ఇండియన్స్‌ టైటిల్ పోరులో నిలిచే అవకాశం ఉంది.

IPL 2025 ఆరెంజ్ క్యాప్ లీడర్‌బోర్డ్

  • సూర్యకుమార్ యాదవ్- 475 పరుగులు

  • సాయి సుదర్శన్- 456 పరుగులు

  • విరాట్ కోహ్లీ- 443 పరుగులు

  • యశస్వి జైస్వాల్- 439 పరుగులు

  • జోస్ బట్లర్- 406 పరుగులు


ఇవి కూడా చదవండి:

GT vs SRH Prediction: నేటి హైదరాబాద్ vs గుజరాత్ మ్యాచ్ విన్ ప్రిడిక్షన్..మనోళ్లు గెలుస్తారా లేక..



Bank Holidays: మే 2025లో 12 రోజులు బ్యాంకులు బంద్.. పూర్తి లిస్ట్ ఇదే

Donald Trump:100 రోజుల్లో ట్రంప్ తుఫాన్..ఒప్పందాల నుంచి ఒడిదొడుకుల దాకా..

Read More Business News and Latest Telugu News

Updated Date - May 02 , 2025 | 12:07 PM