Viral Video: ఆ మాటలేంది భయ్యా.. గిల్ తెలుగులో ఏమన్నాడో మీరే వినండి..
ABN , Publish Date - Jul 10 , 2025 | 08:43 PM
లార్డ్స్‌లో భారత్, ఇంగ్లండ్ (India vs England) మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ హోరాహోరీగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఆల్‌రౌండర్ నీతీష్ కుమార్ రెడ్డి అద్భుత బౌలింగ్‌తో ఒక్క ఓవర్‌లో ఇద్దరిని ఔట్ చేయగా.. కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ ఉత్సాహంతో బాల్ రా మామా, బాగుంది రా మామా అంటూ తెలుగులోనే నీతీష్‌ను మెచ్చుకున్నాడు.

భారత్, ఇంగ్లండ్ (India vs England) మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ లార్డ్స్‌లో జరుగుతోంది. ఈ సందర్భంగా భారత కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ (Shubman Gill), యువ ఆల్‌రౌండర్ నీతీష్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy) మధ్య ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో నీతీష్ ఒకే ఓవర్‌లో ఇంగ్లండ్ ఓపెనర్లు బెన్ డకెట్, జాక్ క్రాలీలను ఔట్ చేసి సంచలనం సృష్టించాడు. ఆ క్రమంలో శుభ్‌మాన్ గిల్ తెలుగులో బాల్ రా మామా, బాగుంది రా మామా అంటూ నీతీష్‌ను ప్రశంసించాడు. అందుకు సంబంధిచిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
టాస్ గెలిచిన ఇంగ్లండ్
ఈ మ్యాచులో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్లు బెన్ డకెట్ (23 పరుగులు), జాక్ క్రాలీ (18 పరుగులు) చేసి ఔటయ్యారు. డ్రింక్స్ బ్రేక్ తర్వాత శుభ్‌మాన్ గిల్ తన వ్యూహాత్మక నిర్ణయంతో ఆట గమనాన్ని మార్చాడు. అతను యువ ఆల్‌రౌండర్ నీతీష్ కుమార్ రెడ్డిని 14వ ఓవర్‌లో బౌలింగ్‌కు దించాడు. ఇది ఎవరూ ఊహించని నిర్ణయమని చెప్పవచ్చు.
తెలుగులో మాట్లాడి..
ఆ క్రమంలోనే నీతీష్ తన రెండో బంతికే బెన్ డకెట్‌ను ఔట్ చేశాడు. ఈ వికెట్‌తో ఇంగ్లండ్ 43/0 నుంచి 44/1కి పడిపోయింది. ఆ తర్వాతి బంతికే నీతీష్ మరో షాక్ ఇచ్చాడు. క్రాలీని అద్భుతమైన డెలివరీతో ఔట్ చేశాడు. బౌన్స్‌తో క్రాలీ గ్లోవ్‌ను బాల్ తాకి పంత్ చేతుల్లోకి వెళ్లింది. ఈ రెండు వికెట్లతో ఇంగ్లండ్ 44/2కి చేరుకుంది. ఆ సమయంలో శుభ్‌మాన్ గిల్ నీతీష్‌తో తెలుగులో మాట్లాడిన సంఘటన అభిమానుల దృష్టిని ఆకర్షించింది. నీతీష్ తెలుగు రాష్ట్రాలకు చెందిన ఆటగాడు కాగా.. గిల్ తెలుగులో మాట్లాడి ప్రస్తుతం తెలుగువారిని ఆశ్చర్యపరిచాడు.
ప్రస్తుతం స్కోర్..
నీతీష్ కుమార్ రెడ్డి, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆల్‌రౌండర్. తన బౌలింగ్‌తో ప్రస్తుతం లార్డ్స్‌లో తన సత్తా చాటాడు. అతని బౌలింగ్‌లోని ఊహించని బౌన్స్, స్వింగ్ ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌లను కంగారుపెట్టాయి. ఈ రెండు వికెట్లు భారత్‌కు మొదటి సెషన్‌లో ఆధిపత్యాన్ని అందించాయి. ప్రస్తుతం ఇంగ్లండ్ స్కోర్ 171/3గా ఉంది. జో రూట్ (62 నాటౌట్), హ్యారీ బ్రూక్ (10 నాటౌట్) క్రీజులో ఉన్నారు.
ఇవి కూడా చదవండి
ఇన్‌కం ట్యాక్స్ 2025 కొత్త రూల్స్.. ఈ అప్‌డేట్ ప్రక్రియ తప్పనిసరి
ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి