Share News

Shreyas Iyer: గాయంపై తొలిసారి స్పందించిన శ్రేయస్!

ABN , Publish Date - Oct 30 , 2025 | 03:11 PM

ఆస్ట్రేలియాతో మూడో వన్డే మ్యాచ్ సందర్భంగా టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ తీవ్రంగా గాయపడిన పడిన విషయం తెలిసిందే. దీంతో అయ్యర్‌ను ఐసీయూలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో అయ్యర్ తన ఆరోగ్య పరిస్థితిపై తొలిసారిగా స్పందించాడు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టాడు.

Shreyas Iyer: గాయంపై తొలిసారి స్పందించిన శ్రేయస్!

ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియాతో మూడో వన్డే మ్యాచ్ సందర్భంగా టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer) తీవ్రంగా గాయపడిన పడిన విషయం తెలిసిందే. క్యాచ్ అందుకునే క్రమంలో పక్కటెములు నేలను బలంగా తాకడంతో అతడి ప్లీహానికి తీవ్ర గాయమైంది. దీంతో అయ్యర్‌ను ఐసీయూలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే అతడి ఆరోగ్యంపై బీసీసీఐ అప్‌డేట్స్(Shreyas Iyer health update) ఇస్తూనే ఉంది. సర్జరీ అవసరం లేకుండానే ప్లీహం వద్ద రక్తస్రావం ఆగిపోయేలా చేసినట్లు బీసీసీఐ(BCCI) కార్యదర్శి దేవజిత్ సైకియా వెల్లడించారు. మరో నాలుగైదు రోజులు శ్రేయస్ ఆసుపత్రిలోనే ఉండే అవకాశం ఉంది. ఈ క్రమంలో అయ్యర్ తన ఆరోగ్య పరిస్థితిపై తొలిసారిగా స్పందించాడు. ఈ మేరకు సోషల్ మీడియా(Social Media) వేదికగా పోస్ట్ పెట్టాడు.


‘ఇప్పుడు నేను రికవరీ ప్రాసెస్‌లో ఉన్నాను. రోజురోజుకూ మెరుగవుతూ ఉన్నా. మీ అందరి దీవెనలతో త్వరలోనే కోలుకుని వస్తా. మీ మద్దతును ఎప్పటికీ మరిచిపోలేను. భారీ స్థాయిలో మీ ప్రేమను పొందుతున్నందుకు ఆనందంగా ఉంది. నాకు ఆశీస్సులు అందించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. నా గురించి నిరంతరం ఆలోచిస్తున్నందుకు ధన్యవాదాలు’ అని అయ్యర్ పోస్ట్‌లో పేర్కొన్నాడు.


అప్పటి వరకు కష్టమే..

శ్రేయస్ ఆసుపత్రి డిశ్చార్జి అయినప్పటికీ.. కనీసం రెండు నెలలపాటు ఆటకు దూరమవుతాడు. ప్రాణాలు పోయేంత ప్రమాదం నుంచి బయటపడటం మాత్రం అభిమానులకు ఊరటనిచ్చింది. ఏ మాత్రం ఆలస్యం చేసినా ప్రాణాల మీదకు వచ్చేదని ఇప్పటికే వైద్య బృందం పేర్కొన్న విషయం తెలిసిందే. అతడు ఎనిమిది వారాలపాటు బ్యాట్ పట్టడం కష్టమే. జనవరి నాటికి ఫిట్‌నెస్ సాధిస్తే న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో ఆడే అవకాశం ఉంది. అప్పటికీ అందుబాటులో లేకపోతే నేరుగా టీ20 ప్రపంచ కప్‌లోనే ఆడాల్సి ఉంటుంది. అది కూడా తుది జట్టుకు ఎంపికైతేనే బరిలోకి దిగుతాడు. మళ్లీ వచ్చే ఏడాది జూన్‌లో ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో టీమిండియా తలపడనుంది. ఆ సమయంలోనే ఐపీఎల్ కూడా ప్రారంభమవుతుంది. రెండు నెలల్లో పూర్తిగా ఫిట్‌నెస్ సాధిస్తే పొట్టి కప్‌లో ఆడే అవకాశం వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.


ఈ వార్తలు కూడా చదవండి..

Gold Price Today: ఇవాళ్టి మార్కెట్లో బంగారం ధరలు

Australian cricketer: విషాదం.. ఆసీస్ యువ క్రికెటర్ మృతి

Updated Date - Oct 30 , 2025 | 03:11 PM