Sania Mirza: రిచా ఘోష్‌కు సానియా సూచన
ABN , Publish Date - Nov 21 , 2025 | 01:45 PM
సోషల్ మీడియా ప్రభావం మన మీద పడకుండా చూసుకోవాలని టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా.. భారత మహిళా క్రికెట్ ప్లేయర్ రిచా ఘోష్‌కు సూచించింది.
ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా మహిళల క్రికెట్ జట్టు సభ్యురాలు రిచా ఘోష్‌కు ఆరుసార్లు గ్రాండ్ స్లామ్ ఛాంపియన్‌గా నిలిచిన టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా(Sania Mirza) ఓ కీలక సూచన చేశారు. బెంగళూరులో జరిగిన టెక్ సమ్మిట్ 2025కి హాజరైన సానియా సోషల్ మీడియా గురించి మాట్లాడింది.
‘రిచా ఘోష్(Richa Ghosh) ఇప్పుడిప్పుడే జట్టులో రాణిస్తోంది. తనకి చాలా భవిష్యత్తు ఉంది. ప్రస్తుతం యువత ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా వైపే ఎక్కువ మొగ్గు చూపుతోంది. కానీ మా రోజుల్లో ఎక్కువగా వార్త పత్రికల పైనే ఆధారపడేవాళ్లం. ఎప్పుడైతే ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిందో అప్పటి నుంచి మా వ్యక్తిగత జీవితాల మీద ఫోకస్ పెరిగింది. ఏదైనా మ్యాచ్ ఓడిపోతే.. ముందురోజు డిన్నర్‌కు వెళ్లడం వల్లే ఇలా జరిగిందంటూ లేనిపోని కథనాలు అల్లేవారు’ అని సానియా వాపోయారు.
జాలి కలిగేది..
‘నేను ఇవన్నీ పెద్దగా పట్టించుకోను. నాకు ఇవి చాలా హాస్యాస్పదంగా అనిపించేవి. ఒక్కసారీ క్రికెట్ బ్యాట్, టెన్నిస్ రాకెట్, బాక్సింగ్ గ్లౌవ్స్ తమ చేత్తో తాకనివారు కూడా క్రీడాకారుల గురించి అలా అనడం నవ్వు తెప్పించేది. నాకు వాళ్లను చూస్తే చిరాకు కంటే, జాలి కలిగేది. ఎందుకంటే.. వారి జీవితంలో ఆనందంగా లేని వారే, ఇలా దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వారిపై బురద చల్లే ప్రయత్నం చేస్తారు. విమర్శలను మనసుకి తీసుకోవద్దు. ముఖ్యంగా సోషల్ మీడియా ప్రభావం మన మీద ఉండకుండా చూసుకోవాలి’ అని సానియా.. రిచాకు సూచించారు.
ఇవి కూడా చదవండి:
ఆ స్థానంపై ప్రయోగాలెందుకు?: ఆకాశ్ చోప్రా
ట్రోల్ చేసి క్షమాపణలు చెప్పాడు: ఆకాశ్ చోప్రా
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి