Share News

Richa Ghosh: ప్రపంచకప్‌ విజేతకు అరుదైన గౌరవం

ABN , Publish Date - Nov 11 , 2025 | 10:10 AM

ప్రపంచ కప్ విజేత రిచా ఘోష్ కు అరుదైన గౌరవం దక్కింది. పశ్చిమ బెంగాల్‌ లో ఆమె పేరిట క్రికెట్‌ స్టేడియం నిర్మితం కానుంది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వయంగా ప్రకటించారు.

 Richa Ghosh: ప్రపంచకప్‌ విజేతకు అరుదైన గౌరవం
Richa Ghosh,

మహిళల వన్డే ప్రపంచకప్(World Cup2025)లో భారత్ విశ్వ విజేతగా నిలిచింది. ఎన్నో దశాబ్దాల కల నిజం కావడంతో క్రికెట్ అభిమానులతో పాటు దేశ వ్యాప్తంగా ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. ఇదే సమయంలో ఇండియాకు వన్డే ప్రపంచకప్ ను అందించిన హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలోని జట్టు సభ్యులపై ప్రశంసల వర్షం కురుస్తోంది. విజేతలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, బహుమతులు, వివిధ పదవులు ఇచ్చి.. సత్కరించాయి. తాజాగా ప్రపంచ కప్ గెలిచిన భారత మహిళా జట్టులో కీలక సభ్యురాలైనా రిచా ఘోష్(Richa Ghosh)కు అరుదైన గౌరవం దక్కింది.


పశ్చిమ బెంగాల్‌(West Bengal)లో రిచా ఘోష్ పేరిట క్రికెట్‌ స్టేడియం నిర్మితం కానుంది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee) స్వయంగా ప్రకటించారు. రిచా ఘోష్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అనే విషయం మనకు తెలిసిందే. నిన్న(నవంబర్ 10న) రిచాకు సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా బెంగాల్ సీఎం మమతా మాట్లాడుతూ.. ఓ స్టేడియం నిర్మించి.. దానికి రిచా పేరు పెడతామని వెల్లడించారు. రిచా జన్మస్థలమైన సిలిగురి పట్టణానికి క్రికెట్‌ మైదానాన్ని కేటాయిస్తూ.. దానికి రిచా ఘోష్‌(Richa Ghosh) పేరుతో నామకరణం​ చేయనున్నట్లు బెంగాల్ ప్రభుత్వం ప్రకటించింది.


రిచా సన్మాన కార్యక్రమంలో బెంగాల్‌ క్రికెట్‌ దిగ్గజాలు సౌరవ్‌ గంగూలీ(Sourav Ganguly), ఝులన్ గోస్వామి పాల్గొన్నారు. పశ్చిమ బెంగాల్ నుంచి సీనియర్ ప్రపంచ కప్ గెలిచిన తొలి క్రికెటర్ గా రిచా చరిత్ర సృష్టించింది. ఫలితంగా ఆమెకు బెంగాల్‌ ప్రభుత్వం నుంచి భారీ నజరానాలు అందాయి. వరల్డ్ కప్ ఫైనల్లో సౌతాఫ్రికాపై రిచా 34 పరుగులు చేయగా... పరుగుకు రూ. లక్ష చొప్పున రూ. 34 లక్షల చెక్కును బెంగాల్ ప్రభుత్వం అందించింది. రిచాకు బంగ భూషణ్‌ బిరుదుతో పాటు రాష్ట్ర పోలీసు శాఖలో డీఎస్పీ ఉద్యోగాన్ని కేటాయించింది. గోల్డెన్ బ్యాట్, గోల్డెన్ బాల్‌తో పాటు విలువైన బంగారు గొలుసును బెంగాల్ ప్రభుత్వం(Bengal government) బహుకరించింది. వరల్డ్ కప్ 2025లో రిచా 8 ఇన్నింగ్స్‌ల్లో 133.52 స్ట్రయిక్‌రేట్‌తో 235 పరుగులు చేసింది.


ఇవి కూడా చదవండి..

Andhra vs Tamil Nadu: తమిళనాడుపై ఆంధ్ర జట్టు సంచలన విజయం

Former Bangladesh Captain: బంగ్లాదేశ్‌ మాజీ కెప్టెన్‌కు గుండెపోటు


మరిన్ని వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Nov 11 , 2025 | 10:34 AM