PSG Coach Luis Enrique Fight: ప్లేయర్లను చితకబాదిన కోచ్.. ఎంత ఆపినా ఆగకుండా..!
ABN , Publish Date - Jul 14 , 2025 | 07:17 PM
క్రీడల్లో ఆటగాళ్ల మధ్య ఘర్షణలు జరగడం సర్వసాధారణమే. ప్లేయర్లు పొల్లు పొల్లు కొట్టుకోవడం కామనే. కానీ ఆటగాళ్లను కోచ్ కొట్టిన సందర్భాలు చాలా తక్కువ. అలాంటి ఘటన క్లబ్ వరల్డ్ కప్ ఫైనల్‌లో చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే..

క్రీడల్లో కొట్లాటలు కామనే. అందునా ఫుట్‌బాల్, రగ్బీ, కబడ్డీ, బాక్సింగ్, కరాటే లాంటి కాంటాక్ట్ గేమ్స్‌లో ఇదీ మరీ ఎక్కువ. ఫుట్‌బాల్‌లో దీన్ని ఎక్కువగా చూస్తుంటాం. మ్యాచ్ కీలక దశలో ఉన్న సమయంలో బంతిపై పట్టు కోసం ఆటగాళ్లు తోసుకోవడాలు, ఒకరి మీదకు ఒకరు దూసుకెళ్లడం లాంటివి కామన్. ఒక్కోసారి ఇవి శ్రుతిమించి ఆటగాళ్లు పొల్లు పొల్లు కొట్టుకోవడం లాంటివి కూడా జరుగుతుంటాయి. అయితే ఇందుకు భిన్నంగా ఓ కోచ్ ప్లేయర్లపై గొడవకు దిగాడు. ఎంతమంది ఆపుతున్నా ఆగకుండా అతడ్ని కొట్టాడు. ఈ ఘటన ఫిఫా క్లబ్ వరల్డ్ కప్ ఫైనల్‌లో చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే..
గొడవ ఆపుతాడనుకుంటే..
క్లబ్ వరల్డ్ కప్‌లో భాగంగా పారిస్ సెయింట్ జర్మన్ ఎఫ్‌సీ-చెల్సియా జట్లకు మధ్య సోమవారం ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఇందులో 3-0 తేడాతో గెలిచిన చెల్సియా కప్‌ను సగర్వంగా అందుకుంది. అయితే ఈ ట్రోఫీ కంటే కూడా మ్యాచ్‌లో జరిగిన గొడవ గురించే ఇప్పుడు జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత పీఎస్‌జీ-చెల్సియా జట్ల ఆటగాళ్ల నడుమ గొడవ జరిగింది. ఇందులో పారిస్ సెయింట్ ఎఫ్‌సీ కోచ్ లూయిస్ ఎన్రిక్ జోక్యం చేసుకున్నాడు. గొడవ సద్దుమణిగేలా చేస్తాడేమో అనుకుంటే.. చెల్సియా జట్టు ఆటగాళ్లపై దాడికి దిగాడు లూయిస్.
నా తప్పు లేదు..
అపోజిషన్ టీమ్ స్ట్రైకర్ జావో పెడ్రోను చితకబాదాడు లూయిస్ ఎన్రిక్. దీంతో అతడు వెంటనే కింద పడిపోయాడు. ఆ తర్వాత ఇరు జట్ల ఆటగాళ్లు ఒకరిపై ఒకరు దాడికి దిగారు. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కోచ్ అంటే ఇలాగేనా ఉండేది అంటూ లూయిస్ ఎన్రిక్‌పై నెటిజన్స్ సీరియస్ అవుతున్నారు. కాగా, గొడవను ఆపేందుకే తాను అక్కడికి వెళ్లానంటూ ఈ వివాదానికి చెక్ పెట్టేందుకు ప్రయత్నించాడు పారిస్ ఎఫ్‌సీ కోచ్.
ఇవీ చదవండి:
కేఎల్ రాహుల్‌కు తప్పని తిట్లు!
ప్లేయర్ల కోసం ఫ్రాంచైజీల పోటాపోటీ!
సిరాజ్ దొరికినా గిల్ తప్పించుకున్నాడు!
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి