Shahid Afridi: మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది మరణించాడా..వైరల్ వీడియో, క్లారిటీ
ABN , Publish Date - Jun 07 , 2025 | 09:48 PM
సోషల్ మీడియాతోపాటు ఏఐ వచ్చిన తర్వాత ఏ వార్త నిజం అనే దానిని తెలుసుకోవాలంటే మాత్రం మళ్లీ ఫ్యాక్ట్ చెక్ చేయాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే మరో వీడియో వెలుగులోకి వచ్చింది. వీడియోలో పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది మరణించినట్లు చెబుతున్నారు.

పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది (Shahid Afridi) మరణించినట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో పాకిస్థాన్ న్యూస్ యాంకర్ అఫ్రిది మరణాన్ని ప్రకటిస్తున్నట్లు కనిపించింది. కానీ నిజమేనా అని ఫ్యాక్ట్ చెక్ చేస్తే మాత్రం అది ఫేక్ అని తేలింది. అందులోని చిత్రాలు, వీడియోలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా సృష్టించబడ్డాయని వెలుగులోకి వచ్చింది. కానీ అఫ్రిది ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారని, నెట్టింట వైరల్ అవుతున్న వీడియో నిజం కాదని ఫ్యాక్ట్ చెక్ టీం తెలిపింది.
షాహిద్ అఫ్రిది క్రికెట్ కెరీర్
షాహిద్ అఫ్రిది 1996లో కెన్యాతో జరిగిన మ్యాచ్‌లో తన ODI కెరీర్ ప్రారంభించారు. తన రెండో మ్యాచ్‌లోనే 37 బంతుల్లో శతకం సాధించి, ODI క్రికెట్లో అత్యంత వేగవంతమైన శతకాన్ని నమోదు చేశారు. ఇది 17 సంవత్సరాల పాటు రికార్డుగా నిలిచింది. ఆ తరువాత, 27 టెస్ట్‌లు, 398 ODIలు, 99 T20Iలు ఆడారు. ODIల్లో 8,064 పరుగులు, 395 వికెట్లు, T20Iల్లో 1,416 పరుగులు, 98 వికెట్లు సాధించారు. అఫ్రిది 476 సిక్సులతో అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సిక్సులు కొట్టిన ఆటగాడిగా నిలిచాడు.
షాహిద్ అఫ్రిది ముఖ్యమైన విజయాలు
2009 T20 ప్రపంచ కప్: అఫ్రిది నాయకత్వంలో పాకిస్థాన్ జట్టు విజయం సాధించింది
2011 ప్రపంచ కప్: అఫ్రిది 21 వికెట్లతో టోర్నీలో అత్యధిక వికెట్లు సాధించి, జట్టు సెమీఫైనల్ వరకు చేరడంలో కీలక పాత్ర పోషించాడు.
విశేష రికార్డులు: ODIల్లో అత్యంత వేగవంతమైన శతకం (37 బంతుల్లో), అత్యధిక సిక్సులు (476), అత్యధిక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు (43) దక్కించుకున్నాడు
సేవా కార్యక్రమాలు
షాహిద్ క్రికెట్ కెరీర్ తరువాత ఫౌండేషన్ స్థాపించి, పాకిస్థాన్‌లో విద్య, ఆరోగ్య సేవలు అందించడంలో పనిచేస్తున్నారు. UNICEFతో కలిసి పోలియో వ్యాక్సినేషన్ కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు.
ఇవీ చదవండి:
మీ పాన్ కార్డ్ యాక్టివ్‌లో ఉందా లేదా.. లేదంటే రూ.10 వేల పైన్
4 శాతం వడ్డీకే రూ.3లక్షల లోన్.. రైతులకు కేంద్రం ఆఫర్..
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..