Share News

Netherlands History: టీ20 క్రికెట్ చరిత్రలో రికార్డ్.. తొలిసారిగా మూడో సూపర్ ఓవర్‌లో విజయం..

ABN , Publish Date - Jun 17 , 2025 | 12:51 PM

టీ20, లిస్ట్ ఏ క్రికెట్ చరిత్రలో ఒక అరుదైన సంఘటన నమోదైంది. క్రికెట్ అభిమానులు, ఆటగాళ్లకు ఇది సరికొత్త అనుభూతిని ఇచ్చింది. ఈ క్రమంలో తొలిసారిగా నెదర్లాండ్స్ (Netherlands History) మూడో సూపర్ ఓవర్‌లో నేపాల్‌ను ఓడించింది.

Netherlands History: టీ20 క్రికెట్ చరిత్రలో రికార్డ్.. తొలిసారిగా మూడో సూపర్ ఓవర్‌లో విజయం..
netherlands won by nepal

టీ20 క్రికెట్ ప్రపంచంలో ఒక అరుదైన రికార్డ్ నమోదైంది. నేపాల్ జట్టుతో జరిగిన మ్యాచ్, ఏకంగా మూడో సూపర్ ఓవర్ వరకు (T20 super over record) వెళ్లగా, నెదర్లాండ్స్ జట్టు (Netherlands History) విజయం సాధించింది. ఇది టీ20, లిస్ట్ ఏ క్రికెట్ చరిత్రలో సరికొత్త సంఘటనగా నిలిచింది. ఈ ఆటలో మొదట నెదర్లాండ్స్‌ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టంతో 152 పరుగులు సాధించింది. తర్వాత వచ్చిన నేపాల్‌ జట్టు చివరి ఓవర్‌లో 16 పరుగులు కావాల్సి ఉన్నప్పటికీ, చివరి బంతి వరకు 152 స్కోర్ వద్ద సమానంగా నిలిచాయి.


మూడో సూపర్ ఓవర్..

ఈ మ్యాచ్ సూపర్ ఓవర్‌కు వెళ్లిన తర్వాత ఉత్కంఠ మరింత పెరిగింది. మొదటి సూపర్ ఓవర్‌లో నేపాల్‌ కుషల్ భుర్తేల్ 18 పరుగులు చేయగా, నెదర్లాండ్స్ ఓపెనర్ మాక్స్ ఓడౌడ్ సుపర్ ఓవర్‌లో చివరి రెండు బంతులకు 6, 4 పరుగులు బాదుతూ స్కోర్లు సమం చేశాడు. అదే విధంగా రెండో సూపర్ ఓవర్‌లో నెదర్లాండ్స్ 17 పరుగులు సాధించింది. ఇక నేపాల్‌ చివరి బంతిపై డిపేంద్ర సింగ్ ఐరీ బంతిని ఔట్ చేయడంతో నెదర్లాండ్స్‌కు మరో అవకాశం వచ్చింది. ఆ తర్వాత మూడో సూపర్ ఓవర్ ముగింపులో నెదర్లాండ్స్‌కు కేవలం ఒక పరుగే కావాల్సి ఉండగా, మైఖేల్ లెవిట్‌ బంతిని సిక్స్‌గా బాదడంతో విజయాన్ని ఖాయం చేసుకున్నారు.


నేపాల్ జట్టు..

మొత్తం మీద క్లోగోలో జరిగిన ఈ మ్యాచులో టీ20 ట్రై సిరీస్‌లో భాగంగా నెదర్లాండ్స్‌ 3 సూపర్ ఓవర్‌ల తర్వాత నేపాల్‌ జట్టును ఓడించింది. ఈ అద్భుతమైన గేమ్ తర్వాత టీ20 క్రికెట్ చరిత్రలో కొత్త రికార్డ్ క్రియేట్ చేశాయి నెదర్లాండ్స్, నేపాల్ జట్లు. మూడో సూపర్ ఓవర్‌ మ్యాచ్‌ ఇప్పటి వరకు ఏ టీ20 లేదా లిస్ట్ ఏ క్రికెట్ మ్యాచ్‌లో జరగలేదు. టీ20 క్రికెట్‌ ఆటలో సూపర్ ఓవర్‌లు పలు మార్లు జరిగాయి. కానీ 3 సార్లు సూపర్ ఓవర్‌కు వెళ్లడం మాత్రం ఇదే తొలిసారి. ఇది క్రికెట్ లోకంలో ఒక మైల్‌స్టోన్. ఇక భవిష్యత్తులో ఇలాంటి ఆసక్తికరమైన, ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లు వస్తాయో లేదో చూడాలి మరి.


ఈ వార్తలు కూడా చదవండి..

హీరో ఫిన్‌కార్ప్‌ రూ 260 కోట్ల సమీకరణ


మీ పర్సనల్ లోన్ ఇలా తీర్చుకోండి.. మీ ఖర్చులు తగ్గించుకోండి..


For National News And Telugu News

Updated Date - Jun 17 , 2025 | 05:19 PM