Home » Netherlands
పర్యావరణాన్ని ప్లాస్టిక్ భూతం నుంచి కాపాడేందుకు నెదర్లాండ్స్ సరికొత్త కిటుకు కనిపెట్టింది. దేశంలో ఎక్కడికక్కడ బాటిల్స్ డిపాజిట్ యంత్రాలను ఏర్పాటు చేసింది. అంతే.. ప్రజలు, పర్యాటకులు వీటి ముందు క్యూ కట్టేస్తున్నారు. పని కట్టుకుని ఎవరూ చెప్పకున్నా తమంతట తామే ప్లాస్టిక్ వ్యర్థాలను ఏరేస్తూ గో గ్రీన్ నినాదాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు.
టీ20, లిస్ట్ ఏ క్రికెట్ చరిత్రలో ఒక అరుదైన సంఘటన నమోదైంది. క్రికెట్ అభిమానులు, ఆటగాళ్లకు ఇది సరికొత్త అనుభూతిని ఇచ్చింది. ఈ క్రమంలో తొలిసారిగా నెదర్లాండ్స్ (Netherlands History) మూడో సూపర్ ఓవర్‌లో నేపాల్‌ను ఓడించింది.
సమాజంలో కులాంతర, మతాంతర వివాహాల్ని చూశాం. ఖండంతార వివాహాల్ని చూశారా? ఉత్తర్ ప్రదేశ్ కి చెందిన ఓ యువకుడు విదేశీ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అది కూడా హిందూ సంప్రదాయం ప్రకారం..
World Cup 2023: ఆదివారం (12-11-23) బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియం వేదికగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఘనవిజయం సాధించింది. టీమిండియా నిర్దేశించిన 411 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆ జట్టు ఛేధించలేకపోయింది. భారత బౌలర్ల ధాటికి 250 పరుగులకే ఆలౌట్ అయ్యింది.
ENG Vs NED: వన్డే ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌కు వరుసగా ఐదు పరాజయాల తర్వాత ఊరట విజయం లభించింది. పుణె వేదికగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 160 రన్స్ తేడాతో గెలిచింది. దీంతో పాయింట్ల పట్లికలో చివరి స్థానం నుంచి ఏడో స్థానానికి ఎగబాకింది.
ODI World Cup 2023: వన్డే ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ ఎట్టకేలకు భారీ స్కోరు సాధించింది. ఇప్పటికే సెమీస్ నుంచి తప్పుకున్న ఇంగ్లండ్ బుధవారం పుణె వేదికగా నెదర్లాండ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 339 పరుగులు సాధించింది. బెన్ స్టోక్స్ సెంచరీతో రాణించగా ఆల్‌రౌండర్ క్రిస్ వోక్స్ హాఫ్ సెంచరీతో సహకారం అందించాడు.
లక్నో వేదికగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఆప్ఘనిస్తాన్ ఘన విజయం సాధించింది. ఈ ప్రపంచకప్‌లో ఆప్ఘనిస్తాన్‌కు ఇది నాలుగో విజయం. దీంతో పాయింట్ల పట్టికలో పాకిస్థాన్‌ను వెనక్కి నెట్టి ఐదో స్థానంలోకి దూసుకెళ్లింది.
ఆప్ఘనిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో నెదర్లాండ్స్ తడబడింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆ జట్టు పూర్తి ఓవర్లు ఆడలేక చతికిలపడింది. 46.3 ఓవర్లలో 179 పరుగులకే ఆలౌట్ అయ్యింది.
ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో నెదర్లాండ్స్ బ్యాటర్లు నిర్లక్ష్యం ప్రదర్శించారు. 9 ఓవర్ల తేడాతో ముగ్గురు రనౌట్ అయ్యారు. ఓడౌడ్, అకెర్ మాన్, కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ రనౌట్ రూపంలో వికెట్ సమర్పించుకున్నారు.
వరల్డ్‌కప్ 2023 మెగా టోర్నీలో భాగంగా శనివారం నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఘోర పరాజయం పాలయ్యింది. అవును.. ఎంతో అనుభవం ఉన్న బంగ్లాదేశ్ జట్టు ఆ పసికూన చేతిలో చిత్తుచిత్తుగా ఓడిపోయింది..