Share News

NADA Suspends Athletes: డోపింగ్ ప్రకంపనలు.. ఏడుగురు అథ్లెట్లు, ముగ్గురు కోచ్‌లపై బ్యాన్

ABN , Publish Date - Apr 20 , 2025 | 02:13 PM

Doping Controversy: భారత క్రీడా రంగంలో మరోమారు డోపింగ్ హాట్ టాపిక్‌గా మారింది. డోపింగ్ ఆరోపణలతో ఏకంగా 10 మంది మీద నాడా నిషేధం విధించింది. అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం..

NADA Suspends Athletes: డోపింగ్ ప్రకంపనలు.. ఏడుగురు అథ్లెట్లు, ముగ్గురు కోచ్‌లపై బ్యాన్
NADA

డోపింగ్ ఆరోపణలతో ఏడుగురు అథ్లెట్లు, ముగ్గురు కోచ్‌లపై నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (నాడా) సస్పెన్షన్ వేటు వేసింది. జూనియర్ జాతీయ జట్టు చీఫ్ కోచ్ రమేష్ నాగ్‌పురితోపాటు ఇద్దరు అదనపు కోచ్‌లు కరంవీర్ సింగ్, రాకేష్‌లకు జరిమానా విధించింది నాడా. సస్పెన్షన్‌కు గురైన క్రీడాకారుల్లో పరాస్ సింఘాల్, పూజా రాణి, నలుబోతు షణ్ముగ శ్రీనివాసులు, చెలిమి ప్రతుష, శుభం మహారా, కిరణ్, జ్యోతి ఉన్నారు.


యాంటీ డోపింగ్ సెల్‌ ఏర్పాటు

డోపింగ్ పరీక్షలకు సహకరించలేదనే ఆరోపణలతో ఈ ఏడుగురు క్రీడాకారులను నాడా సస్పెండ్ చేసింది. డోపింగ్ ఆరోపణలపై భారత అథ్లెటిక్స్ సమాఖ్య (AFI) వేగంగా స్పందించింది. డోపింగ్ ఆరోపణలపై కోచ్‌లు వివరణ ఇవ్వాలని లేని పక్షంలో వారిపై నిషేధం విధిస్తామని హెచ్చరించింది. డోపింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న శిక్షణా కేంద్రాలను పర్యవేక్షించడానికి యాంటీ డోపింగ్ సెల్‌ను కూడా ఏర్పాటు చేసింది నాడా.


బ్యాగ్రౌండ్ ఇదే..

నాడా సస్పెండ్ చేసిన ఏడు మంది అథ్లెట్లు వాళ్ల కేటగిరీల్లో బాగా సక్సెస్ అయినవారే. 19 ఏళ్ల సింఘాల్ ఖేలో ఇండియా యూత్ ఒలింపిక్స్‌-2024 గేమ్స్‌లో మెడల్ కొట్టాడు. పురుషుల 2000 మీటర్ల స్టీపుల్‌చేజ్‌లో హరియాణా తరఫున బరిలోకి దిగి విజేతగా నిలిచాడు. శ్రీనివాస్ అనే మరో ఆటగాడు ఫెడరేషన్ కప్‌లో 200 మీటర్ల ఫైట్‌లో సిల్వర్ మెడల్ గెలుచుకున్నాడు. ఇక, కోచ్ రమేశ్ నాగపురి గురించి చాలా మందికి తెలిసిందే. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్)కు జూనియర్ చీఫ్ కోచ్‌గా సేవలు అందిస్తున్నారు. ద్రోణాచార్య అవార్డు గ్రహీత అయిన రమేశ్‌ను 2023లో జూనియర్ చీఫ్ కోచ్‌గా నియమించింది అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. డోపింగ్ ప్రకంపనల నేపథ్యంలో ఆర్టికల్ 2.9 కింద యాంటీ డోపింగ్ రూల్స్‌ను ఉల్లంఘించారనే నేరంపై ఆయన్ను తాజాగా సస్పెండ్ చేసింది నాడా.


ఇవీ చదవండి:

పక్కా ప్లేఆఫ్స్‌కు వెళ్లేది ఎవరంటే..

కేకేఆర్‌ చెంతకు అభిషేక్‌ నాయర్‌

మా జట్టు భారత్‌ వెళ్లదు: పీసీబీ

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Apr 20 , 2025 | 03:17 PM