Delhi Capitals coach: ఢిల్లీ కోచ్ మునాఫ్‌పై జరిమానా
ABN , Publish Date - Apr 18 , 2025 | 02:40 AM
ఢిల్లీ కోచ్ మునాఫ్ పటేల్ అంపైర్‌తో వాగ్వాదానికి దిగడంతో 25 శాతం మ్యాచ్ ఫీజు కోత విధించారు. అతనికి ఒక డీమెరిట్ పాయింట్ కూడా ఇచ్చారు

న్యూఢిల్లీ: ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ కోచ్ మునాఫ్ పటేల్ మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించారు. రాజస్థాన్ రాయల్స్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో తను ఫోర్త్ అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు. తమ ఆటగాళ్లకు సందేశం ఇచ్చేందుకు రిజర్వ్ ఆటగాడిని అంపైర్ మైదానంలోనికి అనుమతించలేదు. దీంతో మునాఫ్ వాదనకు దిగడం వీడియోలో కనిపించింది. ఈ ప్రవర్తనకు ఫైన్‌తో పాటు ఒక డీమెరిట్ పాయింట్‌ను కూడా మునాఫ్ ఖాతాలో చేర్చారు.