Australian Grand Prix 2025: ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రిక్స్‌లో సంచలనం.. వరల్డ్ చాంపియన్‌కు షాక్
ABN , Publish Date - Mar 16 , 2025 | 02:00 PM
Lando Norris: ఫార్ములా 1 ఆస్ట్రేలియా గ్రాండ్ ప్రిక్స్ రేసింగ్‌లో సంచలనం నమోదైంది. వరల్డ్ చాంపియన్‌కు షాక్ తగిలింది. ఎవరూ ఊహించని రీతిలో అనూహ్య ఫలితం వచ్చింది.

ఫార్ములా 1 రేసింగ్ అనగానే ఈ తరం వారికి రెండే పేర్లే గుర్తుకొస్తాయి. అదే లూయిస్ హామిల్టన్, మ్యాక్స్ వెర్‌స్టాపెన్. గత దశాబ్ద కాలం రేసింగ్‌లో ఈ ఇద్దరిదే హవా నడిచింది. 2014 నుంచి 2020 వరకు వరుసగా 7 సార్లు చాంపియన్‌గా నిలిచాడు హామిల్టన్. అయితే 2021లో రివ్వున దూసుకొచ్చిన వెర్‌స్టాపెన్ వరుసగా తిరుగులేని విజయాలతో నంబర్ వన్ రేసర్‌గా రుబాబు చూపిస్తూ వచ్చాడు. నాలుగేళ్ల పాటు అతడి జోరు కొనసాగింది. అయితే ఈసారి వీళ్లిద్దర్నీ కాదని.. మరో రేసర్ కప్పు ఎగరేసుకుపోయాడు. అతడు ఎవరు.. ఎలా గెలిచాడు.. తదితర వివరాలు ఇప్పుడు చూద్దాం..
టెన్షన్ టెన్షన్..
ఆస్ట్రేలియా గ్రాండ్ ప్రిక్స్‌లో సంచలనం నమోదైంది. చాంపియన్ రేసర్ వెర్‌స్టాపెన్‌కు బిగ్ షాక్ తగిలింది. ఎవరూ ఊహించని రీతిలో మెక్‌లారెన్ రేసర్ లాండో నోరిస్ ట్రోఫీ గెలుచుకున్నాడు. కెరీర్‌లో ఫస్ట్ టైమ్ మెల్‌బోర్న్‌లో గెలుపు బావుటా ఎరగేశాడు నోరిస్. ఓవరాల్‌గా అతడి రేసింగ్ కెరీర్‌లో ఇది ఐదో ట్రోఫీ కావడం విశేషం. దీనిపై అతడు రియాక్ట్ అయ్యాడు. ‘ఈ రేస్ అద్భుతంగా సాగింది. వెర్‌స్టాపెన్ నా వెనకాలే ఉన్నాడు. అతడితో పోటీ రసవత్తరంగా నడిచింది. అయితే ఆఖరి 2 ల్యాప్స్‌లో నేను మరింత వేగం పెంచి దూసుకెళ్లాను. ఆ టైమ్‌లో చాలా ఒత్తిడిగా అనిపించింది. మొత్తానికి టాప్‌లో ఫినిష్ చేయడం సంతోషాన్నించింది’ అని నోరిస్ చెప్పుకొచ్చాడు. కాగా, ఫెరారీ తరపున బరిలోకి దిగిన లూయిస్ హామిల్టన్ 10వ స్థానానికి పరిమితం అయ్యాడు.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి