Share News

Keerthy Suresh: స్టార్ క్రికెటర్‌పై కీర్తి సురేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ABN , Publish Date - Oct 17 , 2025 | 04:18 PM

టాలీవుడ్ టాప్ యాక్టర్ జగపతి బాబు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న 'జయమ్ము నిశ్చయమ్మురా' అనే ఓటీటీ టాక్‌షోలో కీర్తి సురేష్ పాల్గొన్నారు. ఈ క్రమంలో ఫేవరేట్ క్రికెటర్ గురించి కీర్తిని హోస్ట్ జగపతి బాబు ప్రశ్నించగా.. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన ఫేవరేట్ క్రికెటర్ అని తెలిపింది.

Keerthy Suresh: స్టార్ క్రికెటర్‌పై కీర్తి సురేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Keerthy Suresh

టాలీవుడ్ హీరోయిన్ కీర్తి సురేష్ గురించి సినీ లవర్స్ కు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. నేను శైలజ సినిమాతో తెలుగు తెరకు పరిచయమై.. తర్వాత అనేక సినిమాల్లో నటించిన కీర్తి.. తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించింది. ఇటీవలే వివాహం చేసుకుని కొత్త జీవితంలోకి అడుగు పెట్టింది. ఇది ఇలా ఉంటే.. తాజాగా టాలీవుడ్ షోలో పాల్గొన్న ఆమె.. అనేక విషయాలను షేర్ చేసుకున్నారు. ఈ క్రమంలో తనకు ఇష్టమైన క్రికెటర్ ఎవరో చెప్పేసింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం...


టాలీవుడ్ టాప్ యాక్టర్ జగపతి బాబు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న 'జయమ్ము నిశ్చయమ్మురా' అనే ఓటీటీ టాక్‌షోలో కీర్తి సురేష్ పాల్గొన్నారు. ఈ క్రమంలో ఫేవరేట్ క్రికెటర్ గురించి కీర్తి(Keerthy Suresh)ని హోస్ట్ జగపతి బాబు ప్రశ్నించగా.. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన ఫేవరేట్ క్రికెటర్ అని తెలిపింది. ధోనీ(MS Dhoni) అంటే చాలా ఇష్టమని, ఆయనే తన మొదటి క్రష్ అని పేర్కొంది. చిన్ననాటి నుంచి ధోనీని (MS Dhoni)ఆరాధిస్తున్నానని, ఆయన లాంటి వ్యక్తినే పెళ్లి చేసుకోవాలనే కోరిక కూడా ఉండేదని ఈ బ్యూటీ(Keerthy Suresh) చెప్పుకొచ్చింది. గతంలో ఓ ఇంటరాక్టివ్ సెషన్‌లోనూ అభిమాన క్రికెటర్ గురించి ఓ ఫ్యాన్ ప్రశ్నించగా.. ధోనీ పేరును చెబుతూ 'తమ్బి, నమ్మ 7 ఎల్లప్పుడూ!'అని పేర్కొంది. ధోనీ జెర్సీ నెంబర్ 7 అన్న సంగతి అందరికీ తెలిసిందే.


ఇక కీర్తి సురేష్(Keerthy Suresh) సినిమాల విషయానికి వస్తే.. తెలుగులో విజయ్ దేవరకొండ సరసన రౌడీ జనార్దన్ చిత్రంలో నటిస్తోంది. హిందీలో బేబీ జాన్, తమిళ చిత్రాలు రివాల్వర్ రీటా, కన్నెవీడి వంటి ప్రాజెక్ట్‌లతో ఈ బ్యూటీ బిజీగా ఉంది. గతేడాది డిసెంబర్‌లో తన చిన్ననాటి స్నేహితుడు, వ్యాపారవేత్త అయిన ఆంటోనీ తట్టిల్‌ను కీర్తి సురేష్ లవ్ మ్యారేజ్(Love Marriage) చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా ఆమె సినిమాల్లో నటిస్తోంది. మహానటి సినిమాతో కీర్తికి ఉత్తమ నటిగా జాతీయ అవార్డ్ వరించింది.



ఇవి కూడా చదవండి:

బెంగళూరు బిజినెస్ కారిడార్ ప్రాజెక్టుకు కర్ణాటక కేబినెట్ ఆమోదం

మంగళూరులోనూ శ్రీవారి ఆలయం.. భూమి మంజూరు చేసిన ప్రభుత్వం

Updated Date - Oct 17 , 2025 | 05:24 PM