RCB vs SRH: నేడు ఆర్సీబీ vs హైదరాబాద్ మ్యాచ్..ఆర్సీబీ ఓడితే పరిస్థితి ఏంటి
ABN , Publish Date - May 23 , 2025 | 07:28 AM
ఐపీఎల్ 2025 దాదాపు చివరి దశకు వచ్చేసింది. ఇప్పటికే నాలుగు ప్లే ఆఫ్ జట్లు సిద్దమయ్యాయి. ఈ క్రమంలోనే నేడు ఆర్సీబీ, హైదరాబాద్ జట్ల (RCB vs SRH) మధ్య ఆసక్తికర మ్యాచ్ జరగనుంది. ఎందుకంటే ఈ మ్యాచులో ఓవైపు ఆర్సీబీ గెలవాలని చూస్తుండగా, హైదరాబాద్ సైతం విజయం సాధించాలని భావిస్తోంది.

ఐపీఎల్ 2025 (IPL 2025)లో భాగంగా నేడు 65వ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్ల మధ్య కీలక పోరు (RCB vs SRH) జరగనుంది. లక్నోలోని ఒకానా స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్ మొదలు కానుంది. అయితే ఇప్పటికే ప్లే ఆఫ్ రేసు నుంచి తప్పుకున్న హైదరాబాద్, టాప్ 2 ప్లేస్ కోసం పోటీ పడుతున్న ఆర్సీబీతో తలపడనుంది. ఇప్పటికే లక్నో జట్టు ప్లే ఆఫ్ ఆశలను కట్టడి చేసిన హైదరాబాద్ జట్టు ఈ మ్యాచులో ఆర్సీబీని కూడా ఓడించాలని చూస్తోంది. ఆర్సీబీ ఓడితే, SRHకి తన ఆటలో సరికొత్త ఉత్సాహం వస్తుంది. ఇది IPL తదుపరి సీజన్లలో SRH సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి దోహదపడుతుంది.
ఆర్సీబీ ఓడితే పరిస్థితి ఇలా
ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న RCB, ఈ మ్యాచ్ ఓడితే తమ స్థానం మరింత దిగజారి మూడో స్థానానికి చేరుతుంది. IPLలో ఈ పాయింట్లు చాలా కీలకం. పాయింట్ల పట్టికలో పడిపోవడం అంటే ప్లే ఆఫ్స్‌లో తక్కువ అవకాశాలు, గట్టి పోటీ ఉందని అర్థం. దీంతో, RCB బలమైన ప్రత్యర్థులైన ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ వంటి జట్లతో పోటీపడాల్సి వస్తుంది. కాబట్టి ప్లే ఆఫ్స్‌లో టాప్ 2లో నిలవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ స్థానాన్ని నిలబెట్టుకోవడంవల్ల ప్లే ఆఫ్స్‌లో మల్టిపుల్ ఛాన్స్ ఉంటుంది. అంటే, ఒకసారి ఓటమి అయినా కూడా ప్లే ఆఫ్స్ లో ఆరంభ దశ నుంచి తప్పుకోకుండానే మళ్లీ ఇతర జట్లతో ఆడే ఛాన్స్ లభిస్తుంది.
హెడ్ టూ హెడ్ గణాంకాలు
IPLలో ఇప్పటివరకు ఈ రెండు జట్లు 24 సార్లు తలపడ్డాయి. ఆ క్రమంలో SRH 13 సార్లు గెలువగా, RCB 11 సార్లు మాత్రమే విజయం సాధించింది. గణంకాలు చూస్తే మాత్రం హైదరాబాద్ ఫేవరెట్ అనిపిస్తుంది. కానీ గూగుల్ గెలుపు అంచనా ప్రకారం చూస్తే ఆర్సీబీ గెలిచేందుకు 61 శాతం ఛాన్స్ ఉండగా, హైదరాబాద్ జట్టుకు 39 శాతం అవకాశం ఉంది.
ఇరు జట్ల ఆటగాళ్లు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ప్లేయింగ్ 11 (అంచనా): విరాట్ కోహ్లి, రజత్ పాటిదార్ (కెప్టెన్), ఫిల్ సాల్ట్, కృనాల్ పాండ్యా, జితేష్ శర్మ (వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, సుయాష్ శర్మ, యశ్ దయాల్, లుంగి ఎన్గిడి, భువనేశ్వర్ కుమార్,
సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ప్లేయింగ్ 11 (అంచనా): అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, కమిందు మెండిస్, పాట్ కమిన్స్ (కెప్టెన్), హర్షల్ పటేల్, హర్ష్ దూబే, జీషన్ అన్సారీ, ఎషాన్ మలింగ, అథర్వ తైడ్
ఇవీ చదవండి:
బాబోయ్ మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు..
పాకిస్థాన్ ఐఎస్ఐ కుట్రను భగ్నం చేసిన భారత్..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి