KKRvsRR Prediction: కోల్‌కతా vs రాజస్థాన్ మ్యాచ్‌లో ఏ జట్టు గెలిచే ఛాన్సుంది..విన్ ప్రిడిక్షన్
ABN , Publish Date - May 04 , 2025 | 09:37 AM
ఐపీఎల్ 2025లో 53వ మ్యాచ్ కోల్‌కతా నైట్ రైడర్స్ vs రాజస్థాన్ రాయల్స్ మధ్య ఈరోజు (మే 4న) మధ్యాహ్నం జరగనుంది. అయితే ఈ మ్యాచులో ఏ జట్టు గెలిచే ఛాన్స్ ఎక్కువగా ఉందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

ఐపీఎల్ 2025లో నేడు (మే 4న) కోల్‌కతా నైట్ రైడర్స్ vs రాజస్థాన్ రాయల్స్ మధ్య కీలక మ్యాచ్ (KKR vs RR Prediction) జరగనుంది. కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ మైదానంలో మధ్యాహ్నం జరగనున్న ఈ మ్యాచ్ ఆసక్తికరంగా కొనసాగనుంది. అయితే రాజస్థాన్ జట్టు ఇప్పటికే ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకున్నప్పటికీ, రేసులో సజీవంగా ఉన్న KKRను కట్టడే చేయాలని చూస్తోంది. పాయింట్ల పట్టిక విషయానికొస్తే కోల్‌కతా జట్టు 10 మ్యాచ్‌లలో 4 గెలిచి 7వ స్థానంలో ఉంది. ప్లేఆఫ్ రేసులో కొనసాగాలంటే, మిగిలిన 4 మ్యాచ్‌ల్లోనూ కేకేఆర్ గెలవాలి. కాబట్టి ప్రతి మ్యాచ్ కూడా గెలవడం తప్పనిసరిగా మారింది. అయితే ఈ మ్యాచులో ఏ జట్టు ఎక్కువగా గెలిచే ఛాన్సుందనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
KKR vs RR హెడ్ టు హెడ్ రికార్డులు (KKRvsRR Prediction)
ఇరు జట్లు ఆడిన మొత్తం మ్యాచ్‌లు 30. వీటిలో కోల్‌కతా గెలిచింది 15 కాగా, రాజస్థాన్ గెలిచింది 14. ఒకటి అసంపూర్తిగా మారింది. మరోవైపు ఈడెన్ గార్డెన్స్‌లో KKK-RR మధ్య జరిగిన మ్యాచ్‌లు 10 కాగా, KKR 6 గెలువగా, రాజస్థాన్ 4 గెలిచింది.
గెలుపు అంచనా..
కోల్‌కతా తన చివరి మ్యాచ్‌లో గెలిచి ఇక్కడికి చేరుకోగా, రాజస్థాన్ ఓటమిని చవిచూసింది. కోల్‌కతా ఢిల్లీ క్యాపిటల్స్‌ను 14 పరుగుల తేడాతో ఓడించగా, రాజస్థాన్ ముంబైపై 100 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ క్రమంలో ఇరు జట్లు కూడా గెలవాలని భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గూగుల్ గెలుపు అంచనా ప్రకారం చూస్తే మాత్రం ఈ మ్యాచులో కోల్‌కతా నైట్ రైడర్స్ గెలిచేందుకు 59 శాతం అవకాశం ఉండగా, రాజస్థాన్ రాయల్స్ జట్టుకు 41 శాతం ఛాన్సుంది. అయితే ఇక్కడ చెప్పిన ప్రకారం తప్పకుండా ఇలాగే జరుగుతుందని చెప్పలేం. అప్పుడప్పుడు ఈ అంచనా కూడా మారనుంది.
KKR, RR ప్లేయింగ్ 11 అంచనా
కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులో రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), సునీల్ నరైన్, అజింక్యా రహానే (కెప్టెన్), అంగ్క్రిష్ రఘువంశీ, వెంకటేష్ అయ్యర్, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, రోవ్‌మన్ పావెల్, అనుకుల్ రాయ్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, ఇంపాక్ట్ ప్లేయర్ వైభవ్ అరోరా కలరు.
రాజస్థాన్ రాయల్స్ జట్టులో వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్, నితీష్ రాణా, రియాన్ పరాగ్ (c), ధృవ్ జురెల్ (wk), శుభమ్ దూబే, షిమ్రోన్ హెట్మెయర్, జోఫ్రా ఆర్చర్, మహేష్ తీక్షణ, కుమార్ కార్తికేయ, ఆకాష్ మధ్వల్, ఇంపాక్ట్ ప్లేయర్ ఫజల్హాక్ ఫరూకీ ఉన్నారు.
ఇవి కూడా చదవండి:
RCB IPL 2025: ఐపీఎల్ 2025లో అగ్రస్థానంలో ఆర్సీబీ.. ప్లేఆఫ్స్ కోసం ఇంకా ఎన్ని గెలవాలి
Gold Silver Rate Today: షాకింగ్..రూ.7 వేలు పెరిగిన వెండి..కానీ గోల్డ్ మాత్రం..
Jio Offer: రోజు రూ.80కే రీఛార్జ్ ప్లాన్..డేటాతోపాటు అన్ లిమిటెడ్ కాలింగ్
Bank Holidays: మే 2025లో 12 రోజులు బ్యాంకులు బంద్.. పూర్తి లిస్ట్ ఇదే
Hyderabad vs Gujarat: ఈ తప్పులు చేయకుంటే హైదరాబాద్ జట్టు గెలిచేది..కానీ చివరకు
Read More Business News and Latest Telugu News