Womens World Cup 2025: టీమిండియా సెమీస్ చేరాలంటే ఏకైక మార్గం ఇదే!
ABN , Publish Date - Oct 18 , 2025 | 05:30 PM
ప్రస్తుతం మహిళల ప్రపంచకప్ 2025 టోర్నీ జరుగుతోంది. ఇందులో టీమిండియా పరిస్థితి చాలా ఆందోళనగా ఉంది. ఈసారి కప్ సాధించాలనే పట్టుదలతో బరిలో దిగిన భారత్ కు ప్రస్తుతం గడ్డుకాలం నడుస్తోంది. వరల్డ్ కప్ టోర్నమెంట్‌లో సగం మ్యాచ్‌లు ముగిసేసరికి భారత్ ఆడిన 4 మ్యాచ్‌లలో రెండు గెలిచి మరో రెండింటిలో పరాజయం పాలైంది.
ప్రస్తుతం మహిళల ప్రపంచకప్ 2025 టోర్నీ జరుగుతోంది. ఇందులో టీమిండియా పరిస్థితి చాలా ఆందోళనగా ఉంది. ఈసారి కప్ సాధించాలనే పట్టుదలతో బరిలో దిగిన భారత్ కు ప్రస్తుతం గడ్డుకాలం నడుస్తోంది. వరల్డ్ కప్ టోర్నమెంట్‌లో సగం మ్యాచ్‌లు ముగిసేసరికి భారత్ ఆడిన 4 మ్యాచ్‌లలో రెండు గెలిచి మరో రెండింటిలో పరాజయం పాలైంది. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాల చేతిలో ఓటమిపాలైన తర్వాత, టీమిండియా సెమీఫైనల్ రేసులో కష్టాల్లో పడింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో భారత్ టాప్ ఫోర్లో ఉన్నప్పటికీ కేవలం 4 పాయింట్లు మాత్రమే ఉండటం వల్ల ఈ స్థానం సురక్షితం కాదు.
భారత్ సెమీఫైనల్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే మిగిలిన మూడు మ్యాచ్‌లలో కనీసం రెండింటిని తప్పకుండా గెలవాలి. ఇదే ఏకైక మార్గం. అలా కాదని వేరే లెక్కలు వేసిన..భారత్ సెమీస్ ఆశలు గల్లంతైనట్లేనని క్రీడా నిపుణులు భావిస్తున్నారు. భారత్ తన తదుపరి మ్యాచ్‌లో బలమైన ఇంగ్లాండ్(England), న్యూజిలాండ్(New Zland) జట్లతో తలపడాలి. ఈ రెండు మ్యాచ్‌లు భారత జట్టుకు చాలా కీలకం. ఈ రెండింటిలోనూ ఓడిపోతే భారత్ ప్రపంచ కప్ పై(Team India semifinals) ఆశలు వదులుకోవాల్సిందే. అందుకే, టీమిండియా ఈ రెండు జట్లలో కనీసం ఒకదానినైనా ఓడించడం చాలా ముఖ్యం.
భారత్ చివరి లీగ్ మ్యాచ్ బంగ్లాదేశ్‌తో(India vs Bangladesh) ఉంది. ఆ జట్టు ఇప్పటివరకు కేవలం ఒకే ఒక విజయాన్ని నమోదు చేసింది. అయినప్పటికీ భారత జట్టు ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుంటే, బంగ్లాను కూడా తేలికగా తీసుకోవడానికి వీల్లేదు. ఈ మ్యాచ్‌లో కచ్చితంగా విజయం సాధించాల్సి ఉంటుంది. మిగిలిన మూడు మ్యాచ్‌లలో భారత్ కేవలం ఒక్కటి మాత్రమే గెలిస్తే, సెమీఫైనల్ రేసు నుంచి పూర్తిగా వైదొలగకపోయినా, పరిస్థితి చాలా క్లిష్టంగా మారుతుంది. కాబట్టి, సెమీఫైనల్ బెర్త్‌ను సులభంగా ఖాయం చేసుకోవాలంటే, భారత్(India) తప్పనిసరిగా మిగిలిన మూడు మ్యాచ్‌లలో రెండు గెలవడమే ఏకైక సురక్షిత మార్గం.
ఇవి కూడా చదవండి:
పీసీబీ చీఫ్ కుతంత్రాలు.. ఇప్పటికీ టీమిండియా చేతికి దక్కని ఆసియా కప్ ట్రోఫీ
Rashiid Khan: పాకిస్తాన్‌పై రషీద్ ఖాన్ నిప్పులు
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి