India Bangladesh Tour: భారత జట్టు బంగ్లాదేశ్ టూర్ రీ షెడ్యూల్.. మళ్లీ ఎప్పుడంటే..
ABN , Publish Date - Jul 05 , 2025 | 09:23 PM
భారత్, బంగ్లాదేశ్ మధ్య జరగాల్సిన వన్డే, టీ20 సిరీస్‌ల నుంచి కీలక ప్రకటన వచ్చింది. ఈ జట్ల మధ్య 2025 ఆగస్టులో సిరీస్ జరపాలని నిర్ణయించగా, తాజాగా ఇది వాయిదా (India Bangladesh Tour) పడింది.

భారత్, బంగ్లాదేశ్ మధ్య క్రికెట్ సిరీస్ సంబంధించిన కీలక అప్డేట్ (India Bangladesh Tour) వచ్చింది. 2025 ఆగస్టులో జరగాల్సిన వన్డేలు, టీ20 సిరీస్‌ను ఒక సంవత్సరం పొడిగించి 2026లో నిర్వహించనున్నట్లు BCCI అధికారికంగా తెలిపింది. ఈ సిరీస్ కొత్త తేదీలను ప్రకటించకపోయినా, క్రికెట్ అభిమానులు ఎదురుచూసిన బంగ్లాదేశ్ పర్యటన మాత్రం వాయిదా పడింది. వాస్తవానికి ఆగస్టు 2025లో బంగ్లాదేశ్ పర్యటనలో భారత జట్టు 3 వన్డేలు, 3 టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఆడాల్సి ఉంది. కానీ ఇప్పుడు దానిని సంవత్సరం పాటు పొడిగించారు.
సంవత్సరం పాటు రద్దు
బీసీసీఐ, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఈ సిరీస్‌ను సెప్టెంబర్ 2026 వరకు వాయిదా వేయడానికి పరస్పరం అంగీకరించాయి. రెండు జట్ల షెడ్యూల్ సౌలభ్యాన్ని పరిగణనలోకి తీసుకుని రెండు బోర్డుల మధ్య చర్చల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సిరీస్ కోసం సెప్టెంబర్ 2026లో భారత జట్టును స్వాగతించడానికి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఎదురుచూస్తోంది. ఈ సిరీస్ షెడ్యూల్‌ను తగిన సమయంలో ప్రకటిస్తామని బోర్డు తెలిపింది.
రద్దు చేయడానికి కారణం
భారత్, బంగ్లాదేశ్ మధ్య వైట్ సిరీస్ రద్దుకు రెండు జట్ల టైట్ షెడ్యూల్ కారణమని చెబుతున్నారు. అయితే, ఇతర కారణాలు కూడా ఉండవచ్చు. కానీ BCCI ఎటువంటి కారణాలను బహిర్గతం చేయలేదు.
విరాట్-రోహిత్ కోసం..
ప్రస్తుతం భారతదేశం, ఇంగ్లాండ్ మధ్య 5 టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ జరుగుతోంది. ఈ సిరీస్ ఆగస్టు మొదటి వారం వరకు కొనసాగుతుంది. అదే సమయంలో, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ T20, టెస్ట్‌ల నుంచి రిటైర్ అయ్యారు. ఇప్పుడు ఇద్దరు దిగ్గజాలు వన్డే మ్యాచ్‌లు మాత్రమే ఆడనున్నారు. దీంతో 2025 ఆగస్టులో రోహిత్-విరాట్‌లను మైదానంలో చూస్తారని అభిమానులు ఆశించారు. కానీ ఇప్పుడు అభిమానుల వేచి చూసే సమయం మరింత పెరిగింది.
ఇవి కూడా చదవండి
స్టాక్ మార్కెట్‌లో భారీ కుంభకోణం..జేన్ స్ట్రీట్‌పై సెబీ చర్యలు
యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి