Share News

India vs Australia: టీమిండియా టార్గెట్ ఎంతంటే..?

ABN , Publish Date - Oct 30 , 2025 | 07:15 PM

మహిళల వన్డే ప్రపంచ కప్‌లో భాగంగా రెండో సెమీ ఫైనల్‌‌లో టీమిండియా-ఆస్ట్రేలియా తలపడుతున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ 49.5 ఓవర్లలో 338 పరుగులు చేసి ఆలౌటైంది. దీంతో టీమిండియాకు 339 పరుగుల భారీ టార్గెట్‌ను ఆసీస్ నిర్దేశించింది.

India vs Australia: టీమిండియా టార్గెట్ ఎంతంటే..?

మహిళల వన్డే ప్రపంచ కప్‌లో భాగంగా రెండో సెమీ ఫైనల్‌‌లో టీమిండియా-ఆస్ట్రేలియా తలపడుతున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ 49.5 ఓవర్లలో 338 పరుగులు చేసి ఆలౌటైంది. దీంతో టీమిండియాకు 339 పరుగుల భారీ టార్గెట్‌ను నిర్దేశించింది. ఓపెనర్ లీచ్ ఫీల్డ్(119) సూపర్ సెంచరీతో అదరగొట్టింది. లీచ్ కేవలం 93 బంతుల్లో 17 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో 119 పరుగులు చేసింది. ఎలీస్ పెర్రీ(77) హాఫ్ సెంచరీతో రాణించింది. ఆష్లీన్ గార్డ్‌నర్(63) చివర్లో మెరుపులు మెరిపించింది. బెత్ మూనీ(24), కిమ్ గార్త్(17),తాహిలా మెక్‌గ్రాత్(12) పరుగులు చేశారు. భారత బౌలర్లలో శ్రీ చరణి 2, దీప్తి శర్మ 2, క్రాంతి గౌడ్, అమన్‌జ్యోత్ కౌర్, రాధా యాదవ్ తలో వికెట్ పడగొట్టారు.


ఇద్దరు రనౌట్..

దూకుడుగా ఆడుతున్న ఆసీస్ బ్యాటర్లను భారత బౌలర్లు కట్టడి చేయడంలో విఫలమయ్యారు. దీని వల్ల ఆసీస్ 338 భారీ పరుగులు చేయగలిగింది. లీచ్ ఫీల్డ్, ఎలీస్ పెర్రీ కలిసి రెండో వికెట్‌కు 155 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. లీచ్ ఫీల్డ్ ఔటయ్యాక.. ఆసీస్ బ్యాటర్లు ఒక్కొక్కరిగా పెవిలియన్ బాట పట్టారు. 265 పరుగలు వద్ద తాలియా మెక్‌గ్రాత్(12) రనౌట్‌గా వెనుదిరిగింది. అద్భుతమైన త్రోతో జెమీమా రోడ్రిగ్స్ మెక్‌గ్రాత్‌ను ఔట్ చేసింది. 331 పరుగుల వద్ద ఆసీస్ ఏడో వికెట్ కోల్పోయింది. రాధా యాదవ్ బౌలింగ్‌లో మంచి ఫామ్‌లో ఉన్న గార్డ్‌నర్(63)ను క్రాంతి గౌడ్ అద్భుతమైన త్రోతో పెవిలియన్‌కు పంపింది.


టీమిండియా ఛేదిస్తుందా..?

ఆసీస్ బ్యాటర్ల ధాటికి భారత బౌలర్లు విఫలమయ్యారు. ఆసీస్ ఏకంగా టీమిండియాకు 339 పరుగుల భారీ లక్ష్యాన్ని అందించింది. వర్షం అంతరాయం కలగకుండా.. వికెట్లు కోల్పోకుండా ఆడటంతో పాటు.. చివరి వరకు భారత బ్యాటర్లు విజృంభిస్తేనే టార్గెట్ ఛేదించగలమని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Gold Price Today: ఇవాళ్టి మార్కెట్లో బంగారం ధరలు

Australian cricketer: విషాదం.. ఆసీస్ యువ క్రికెటర్ మృతి

Updated Date - Oct 30 , 2025 | 07:17 PM