IND VS AUS T20: ముగిసిన ఆసీస్ బ్యాటింగ్..భారత్ టార్గెట్ ఎంతంటే?
ABN , Publish Date - Nov 02 , 2025 | 03:37 PM
హోబర్ట్ వేదికగా ఆస్ట్రేలియా, భారత్ మధ్య మూడో టీ 20 మ్యాచ్ జరుగుతుంది. తొలుత బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది.
క్రీడా వార్తలు: ఐదు టీ 20ల సిరీస్ లో భాగంగా హోబర్ట్ వేదికగా ఇండియాతో జరుగుతున్న మూడో టీ20లో ఆస్ట్రేలియా బ్యాటర్లు అదరగొట్టారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. టిమ్ డేవిడ్( 74), మార్కస్ స్టోయినిష్(64) విధ్వంసకర హాఫ్ సెంచరీలతో మెరిశారు. భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్ 3, వరుణ్ చక్రవర్తి 2, శివం దూబె 1 వికెట్ తీశారు. మొత్తంగా భారత్ ముందు 187 పరుగుల టార్గెట్ ఉంది. ఇప్పటికే తొలి టీ 20 మ్యాచ్ రద్దు కాగా.. రెండో మ్యాచ్ లో భారత్ చిత్తుగా ఓడిన సంగతి తెలిసిందే.
చరిత్ర సృష్టించిన డేవిడ్:
ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా బ్యాటర్ టిమ్ డేవిడ్ చరిత్ర సృష్టించాడు. ఇంటర్నేషనల్ టీ20ల్లో భారీ సిక్సర్ బాదిన తొలి బ్యాటర్‌గా నిలిచాడు. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో ఈ ఆస్ట్రేలియా బ్యాటర్ 129 మీటర్ల భారీ సిక్సర్ బాదాడు. 2012లో మార్టిన్ గప్టిల్ సౌతాఫ్రికాపై 127 మీటర్ల సిక్స్ కొట్టగా.. తాజాగా 129 మీటర్ల సిక్స్‌తో డేవిడ్ ఈ రికార్డ్‌ను అధిగమించాడు. ఈ జాబితాలో టిమ్ డేవిడ్, మార్టిన్ గప్టిల్ తర్వాత యువరాజ్ సింగ్(119 మీటర్లు), క్రిస్ గేల్(116 మీటర్లు) ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
అంతర్జాతీయ టీ20లకు విలియమ్సన్ వీడ్కోలు
అమ్మాయిలకు ఆల్ ది బెస్ట్.. భారత్‌లో 'దంగల్' మూమెంట్
మరిన్ని స్పోర్ట్స్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..