Share News

IND vs AUS 3rd T20: వాషింగ్టన్ సుందర్ విధ్వంసం.. మూడో టీ20లో భారత్ గెలుపు

ABN , Publish Date - Nov 02 , 2025 | 05:20 PM

హోబర్ట్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో T20 మ్యాచ్ లో 5 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది.

IND vs AUS 3rd T20: వాషింగ్టన్ సుందర్ విధ్వంసం.. మూడో టీ20లో భారత్ గెలుపు
IND VS AUS

క్రీడా వార్తాలు: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో T20 మ్యాచ్ లో 5 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. వాషింగ్టన్ సుందర్(23 బంతుల్లో 49 పరుగులు) విధ్వంసకర బ్యాటింగ్ తో ఇండియాను గెలిపించాడు. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి.. 186 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన భారత్18.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో వాషింగ్టన్‌ సుందర్‌ (49*) బాగా రాణించాడు. అతడి తర్వాత తిలక్‌ వర్మ (29), అభిషేక్‌ శర్మ (25), సూర్యకుమార్‌ యాదవ్‌ (24)లు చెప్పుకోదగ్గ స్కోర్ చేశారు.


ఆస్ట్రేలియా నిర్దేశించిన 187 పరుగుల భారీ టార్గెట్ ను చేధించేందుకు.. ఇండియా తన బ్యాటింగ్‌ను దూకుడుగా ప్రారంభించింది. ముఖ్యంగా అభిషేక్‌ శర్మ మొదటి రెండు ఓవర్లలో రెండు సిక్స్‌లు, రెండు ఫోర్లతో ఆసీస్ బౌలర్లపై విరుచుకు పడ్డాడు. అయితే దురదృష్టవశాత్తు అభిషేక్‌ (25) నాథన్‌ ఎల్లిస్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఆ తర్వాత కాసేపటికే శుభ్‌మన్‌ గిల్‌ (15) ఎల్లిస్‌ బౌలింగ్‌లోనే ఎల్‌బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. తర్వాత భారత కెప్టెన్ సూర్యకుమార్‌ యాదవ్‌ (24)ను స్టాయినిస్‌ ఔట్ చేశాడు.


ఇక త్రుటిలో హాఫ్‌సెంచరీని మిస్‌చేసుకున్న వాషింగ్టన్‌ సుందర్‌ (49*) చివరి వరకు క్రీజులో పాతుకుపోయి, భారత్ కు విజయాన్ని అందించాడు. జితేశ్ శర్మ (22) టీమిండియా విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. ఆసీస్‌ బౌలర్లలో నాథన్‌ ఎల్లిస్‌ 3, జేవియర్‌ బ్రేట్‌లెట్‌, మార్కస్‌ స్టాయినిస్‌ తలో వికెట్‌ సాధించారు. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. టిమ్‌ డేవిడ్‌ (74), స్టాయినిస్‌ (64) అర్ధశతకాలతో రాణించారు. భారత్‌ బౌలర్లలో అర్ష్‌దీప్‌ 3 వికెట్లు పడగొట్టగా.. వరుణ్‌ చక్రవర్తి 2, శివమ్‌ దూబె ఒక వికెట్‌ తీశారు. మొత్తంగా రెండో టీ 20లో ఘోర ఓటమికి ఈ మ్యాచ్ గెలుపుతో భారత్ ప్రతీకారం తీర్చుకుంది.


ఇవి కూడా చదవండి..

అంతర్జాతీయ టీ20లకు విలియమ్సన్ వీడ్కోలు

అమ్మాయిలకు ఆల్ ది బెస్ట్.. భారత్‌లో 'దంగల్' మూమెంట్

మరిన్ని స్పోర్ట్స్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Nov 02 , 2025 | 05:56 PM