Irfan Pathan-Sanju Samson: సపోర్ట్ ఎప్పుడూ ఉండదు: ఇర్ఫాన్ పఠాన్
ABN , Publish Date - Nov 02 , 2025 | 04:35 PM
ఆసీస్-టీమిండియా మధ్య ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా ఆదివారం హోబర్ట్ వేదికగా మూడో టీ20 కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌లో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్‌కు తుది జట్టులో చోటు దక్కలేదు. తాజాగా అతడి భవిష్యత్తుపై టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఆసీస్-టీమిండియా మధ్య ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా ఆదివారం హోబర్ట్ వేదికగా మూడో టీ20(India vs Australia T20 series) కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌లో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్(Sanju Samson)కు తుది జట్టులో చోటు దక్కలేదు. గత కొంత కాలంగా ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతున్న సంజూ.. ఆసియా కప్ నుంచి అనుకున్నంత స్థాయిలో ప్రదర్శనలు ఇవ్వడం లేదు. తాజాగా అతడి భవిష్యత్తుపై టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్(Irfan Pathan) మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశాడు.
‘టీ20 ఫార్మాట్‌లో ఫ్లెక్సిబిలిటీ తప్పనిసరి. అయినా దానికి కూడా హద్దులుండాలి. సంజూ శాంసన్‌ను ఒక నంబర్‌లో ఉంచకుండా ప్రతి సారీ మారుస్తూ ఉంటే ఎలా ప్రదర్శన ఇవ్వగలుగుతాడు? టీ20ల్లో ఓపెనర్లకు మాత్రమే ఫిక్స్‌డ్ రోల్ ఉంటుంది. మిగతావాళ్లకు కూడా అలాంటి స్థిరత్వం అవసరం. ఫ్లెక్సిబిలిటీ పేరుతో జట్టులో స్థిరత్వాన్ని కోల్పోయేలా చేస్తే ప్రమాదం. ఈ అంశంపై టీమ్ మేనేజ్‌మెంట్ సీరియస్‌గా ఆలోచించాలి’ అని ఇర్ఫాన్ వ్యాఖ్యానించాడు.
అది భిన్నమైనది..
‘ఓపెనింగ్ చేసినప్పుడు మూడు శతకాలతో రెచ్చిపోయిన సంజూ.. ఆసియా కప్‌లో మాత్రం మధ్య ఓవర్లలో ఇబ్బంది పడ్డాడు. ఈ రెండు పాత్రలు పూర్తిగా భిన్నమైనవి. ఓపెనింగ్ చేసేటప్పుడు బంతి కొత్తగా ఉంటుంది. దానికి అలవాటు పడినప్పుడు మధ్య ఓవర్లలో పాత బంతిని ఎదుర్కోవడం కష్టం. సంజూకి ప్రస్తుతం టీమ్ మేనేజ్‌మెంట్ పూర్తి సపోర్ట్ ఇస్తోంది. అయితే వరుసగా 3-4 ఇన్నింగ్స్‌లో విఫలమైతే అదే సపోర్ట్ ఒక్కసారిగా అదృశ్యమైపోతుంది.
‘శుబ్‌మన్ గిల్ తిరిగి ఓపెనర్‌గా వచ్చినా.. సంజూ జట్టులోనే కొనసాగుతున్నాడు. అప్పుడప్పుడు సంజూకి జట్టులో అవకాశం ఇస్తున్నారు. ఇది అతనికి ఇప్పటికీ మద్దతు ఉందని సూచిస్తోంది. కానీ వరుసగా కొన్ని మ్యాచుల్లో ఫెయిల్ అయితే ఆ సపోర్ట్ చాలా వేగంగా తగ్గిపోవచ్చు. అలాంటిదేమీ సంజూకి జరగకూడదని ఆశిస్తున్నా’ అని ఇర్ఫాన్ పఠాన్ వ్యాఖ్యానించాడు.
ఈ వార్తలు కూడా చదవండి:
IND VS AUS T20: ముగిసిన ఆసీస్ బ్యాటింగ్..భారత్ టార్గెంట్ ఎంతంటే?
Harmanpreet Kaur: విజయాన్ని ఆస్వాదించాలనుకుంటున్నాం: హర్మన్