MBA Graduate Found lifeless: ఫ్యామిలీని వదిలి ఒంటరిగా.. ఫ్లాట్‌లో శవమై..
ABN , Publish Date - Nov 02 , 2025 | 05:00 PM
శనివారం ఇంటి ఓనర్ యువతి ఉండే ఫ్లాట్ దగ్గరకు వెళ్లాడు. తలుపు లోపలినుంచి గడియ పెట్టి ఉంది. తలుపు బద్దలు కొట్టి ఇంటి లోపలికి ప్రవేశించాడు. బెడ్ రూములో కుళ్లిన స్థితిలో యువతి శవం వెలుగు చూసింది.
25 ఏళ్ల ఓ యువతి అద్దె ఇంట్లో శవమై తేలింది. కుళ్లిన స్థితిలో ఆ యువతి శవం వెలుగు చూసింది. ఈ సంఘటన కర్ణాటకలో ఆలస్యంగా బయటపడింది. పోలీసులు తెలిపిన పూర్తి వివరాల్లోకి వెళితే.. దావణ్‌గెరెకు చెందిన ఓ యువతి రెండేళ్ల క్రితం ఎంబీఏ పూర్తి చేసింది. ప్రస్తుతం బెంగళూరులోని ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తోంది. ఫ్యామిలీని విడిచి బెంగళూరులోని గాయత్రి నగర్‌లో రూము తీసుకుని ఒంటరిగా ఉంటోంది.
గత కొన్ని రోజుల నుంచి తల్లిదండ్రులు యువతికి ఫోన్ చేస్తున్నారు. ఫోన్ స్విచ్చాఫ్ వస్తోంది. దీంతో ఇంటి ఓనర్‌కు ఫోన్ చేసి విషయం చెప్పారు. శనివారం ఇంటి ఓనర్ యువతి ఉండే ఫ్లాట్ దగ్గరకు వెళ్లాడు. తలుపు లోపలినుంచి గడియ పెట్టి ఉంది. తలుపు బద్దలు కొట్టి ఇంటి లోపలికి ప్రవేశించాడు. బెడ్ రూములో కుళ్లిన స్థితిలో యువతి శవం వెలుగు చూసింది. ఆ శవం ఉరికి వేళాడుతూ ఉంది.
అతడు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఫ్లాట్ వద్దకు చేరుకున్న పోలీసులు యువతి శవాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఆమె మొబైల్ ఫోన్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. యువతి గత కొంతకాలంగా డిప్రెషన్‌తో బాధపడుతోందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఆ కారణంతోటే సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. యువతి చనిపోయి వారం రోజులు అయి ఉంటుందని అంటున్నారు. అన్ని కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
లండన్ చేరుకున్న సీఎం చంద్రబాబు దంపతులు