Share News

Hong Kong Super Sixes: పాక్‌పై భారత్ విజయం

ABN , Publish Date - Nov 07 , 2025 | 03:39 PM

హాంకాంగ్ సూపర్ సిక్సెస్ 2025లో భాగంగా ఇవాళ(నవంబర్ 7) ఇండియా-పాకిస్తాన్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టీమిండియా రెండు పరుగుల తేడాతో పాకిస్తాన్‌పై సంచలన విజయం నమోదు చేసింది.

Hong Kong Super Sixes: పాక్‌పై భారత్ విజయం
Hong Kong Super Sixes

ఇంటర్నెట్ డెస్క్: హాంకాంగ్ సూపర్ సిక్సెస్(Hong Kong Super Sixes 2025)లో భాగంగా ఇవాళ(నవంబర్ 7) ఇండియా-పాకిస్తాన్(India vs Pakistan) జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టీమిండియా(Team India) రెండు పరుగుల తేడాతో పాకిస్తాన్‌పై సంచలన విజయం నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత ఆరు ఓవర్లకు నాలుగు వికెట్లు కోల్పోయి 86 పరులు చేసింది. రాబిన్ ఊతప్ప(28), భరత్ చిప్లి(24) రాణించారు. స్టువర్ట్ బిన్నీ(4), అభిమన్యు మిథున్(6) నిరాశ పర్చారు. దినేశ్ కార్తీక్(17*) దూకుడుగా ఆడి నాటౌట్‌గా నిలిచాడు. పాకిస్తాన్ బౌలర్లలో మహ్మద్ షెహజాద్ 2, అబ్దుల్ సమద్ ఒక వికెట్ తీసుకున్నారు. అభిమన్యు మిథున్ రనౌట్‌గా వెనుదిరిగాడు.


వరుణుడి ఆటంకం..

87 పరుగుల లక్ష్యంతో పాక్ బ్యాటింగ్‌కు దిగింది. మూడు ఓవర్ల తర్వాత వరుణుడు ఆటకు అంతరాయం కలిగించాడు. ఆ సమయానికి పాక్ ఒక వికెట్ నష్టానికి 41 పరుగులు చేసింది. తిరిగి ఆట కొనసాగే పరిస్థితి లేకపోవడంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో టీమిండియా రెండు పరుగుల తేడాతో విజయం సాధించింది. వర్షంతో ఆట ఆగే సమయానికి ఖవాజా నఫే(18), అబ్దుల్ సమద్(16) క్రీజులో ఉన్నారు. మాజ్ సదఖత్ 7 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. భారత బౌలర్లలో స్టువర్ట్ బిన్నీ ఓ వికెట్ పడగొట్టాడు. కాగా టీమిండియా తన తదుపరి మ్యాచ్‌లో కువైట్‌తో తలపడనుంది.


ఇటీవల కాలంలో పాకిస్తాన్‌పై భారత్ గెలవడం ఇది ఐదోసారి. పహల్గాం ఉగ్రదాడి తర్వాత టీమిండియా పురుషుల జట్టు పాక్‌ను ఆసియా కప్-2025లో మూడు సార్లు ఓడించింది. అనంతరం భారత మహిళల జట్టు వన్డే ప్రపంచ కప్‌లో పాక్‌ను మట్టికరిపించింది.


ఈ వార్తలు కూడా చదవండి:

భారత హాకీకి వందేళ్లు!

మాజీ సెలెక్టర్ లైంగికంగా వేధించాడు: జహనారా ఆలమ్

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Nov 07 , 2025 | 03:39 PM