Ind vs Eng: గిల్ సెంచరీ.. శ్రేయస్, కోహ్లీ హాఫ్ సెంచరీలు.. ఇంగ్లండ్ ముందు భారీ టార్గెట్..
ABN , Publish Date - Feb 12 , 2025 | 05:47 PM
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతున్న ఆఖరి వన్డేలో వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అదరగొట్టాడు. తన ఫేవరెట్ మైదానంలో మరో సెంచరీ సాధించాడు. గత కొంత కాలంగా విఫలమవుతున్న స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా తిరిగి ఫామ్ అందుకున్నాడు.

అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో భారత బ్యాటర్లు అద్భుత ప్రదర్శన కనబరిచారు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతున్న ఆఖరి వన్డేలో వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అదరగొట్టాడు. తన ఫేవరెట్ మైదానంలో మరో సెంచరీ సాధించాడు. గత కొంత కాలంగా విఫలమవుతున్న స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా తిరిగి ఫామ్ అందుకున్నాడు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. ఇంగ్లండ్ ముందు భారీ టార్గెట్ ఉంచింది. నిర్ణీత 50 ఓవర్లలో 10 వికెట్లు కోల్పోయి 356 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది.
టీమిండియా కెప్టెన్, గత మ్యాచ్ సెంచరీ హీరో రోహిత్ శర్మ (1) త్వరగానే నిష్క్రమించినా, మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌తో కలిసి వన్ డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. వీరిద్దరూ వికెట్ కాపాడుకుంటూనే దూకుడుగా ఆడారు. ఫోర్లు, సిక్స్‌లతో చెలరేగిన గిల్ 102 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్స్‌లతో 112 పరుగులు చేసి ఔటయ్యాడు. మంచి టచ్‌లో కనిపించిన కోహ్లీ 55 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 52 పరుగులు చేశాడు. వీరి తర్వాత వచ్చిన శ్రేయాస్ అయ్యర్ (64 బంతుల్లో 78), కేఎల్ రాహుల్ (29 బంతుల్లో 40) వేగంగా ఆడడంతో భారత్ భారీ లక్ష్యాన్ని నిర్దేశించే దిశగా కదిలింది.
చివర్లో హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ వేగంగా ఆడే క్రమంలో అవుట్ అయ్యారు. దీంతో టీమిండియా సరిగ్గా 50 ఓవర్లలో 10 వికెట్లు కోల్పోయి 356 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో ఆదిల్ రషిద్ 4 వికెట్లు పడగొట్టాడు. మార్క్‌వుడ్ రెండు వికెట్లు తీశాడు. షకిబ్, అట్కిన్సన్, జో రూట్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. ఇంగ్లండ్ ఈ మ్యాచ్‌లో గెలవాలంటే 357 పరుగులు చేయాల్సి ఉంది.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..