Shubman Gill: గిల్ నెంబర్ వన్.. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్‌లో నిలిచిన టీమిండియా స్టార్స్ ఎవరంటే..
ABN , Publish Date - Mar 05 , 2025 | 05:33 PM
ఐసీసీ విడుదల చేసిన వన్డే బ్యాటర్ ర్యాంకింగ్స్‌లో శుభ్‌మన్ గిల్ తన అగ్రస్థానాన్ని కాపాడుకున్నాడు. 791 పాయింట్లతో తొలి స్థానంలో నిలిచాడు. ఇక, తాజా ఛాంపియన్స్ ట్రోఫీలో పరుగుల ప్రవాహం సృష్టిస్తున్న విరాట్ కోహ్లీ నాలుగో స్థానానికి ఎగబాకాడు.

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) తన హవా కొనసాగిస్తున్నాడు. తాజాగా ఐసీసీ విడుదల చేసిన వన్డే బ్యాటర్ ర్యాంకింగ్స్‌లో తన అగ్రస్థానాన్ని కాపాడుకున్నాడు. 791 పాయింట్లతో తొలి స్థానంలో నిలిచాడు. ఇక, తాజా ఛాంపియన్స్ ట్రోఫీలో పరుగుల ప్రవాహం సృష్టిస్తున్న విరాట్ కోహ్లీ (Virat Kohli) నాలుగో స్థానానికి ఎగబాకాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఐదో స్థానంలో నిలిచాడు. అలాగే మంచి ఫామ్‌లో కొనసాగుతున్న శ్రేయస్ అయ్యర్ 8వ స్థానం దక్కించుకున్నాడు (ICC ODI Batters Rankings).
అలాగే ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా అగ్రస్థానంలో నిలిచింది. 122 రేటింగ్ పాయింట్లతో తొలి స్థానంలో ఉంది. ఆ తర్వాత ఆస్ట్రేలియా, పాకిస్తాన్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్లు వరుసగా తర్వాతి స్థానాల్లో నిలిచాయి. అలాగే వన్డే బౌలర్ల జాబితాలో శ్రీలంక బౌలర్ తీక్షణ తొలి స్థానంలో నిలిచాడు. టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఒక్కడే టాప్ టెన్‌లో స్థానం సంపాదించాడు. అలాగే వన్డే ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో అఫ్గానిస్తాన్‌కు చెందిన ఒమార్జీ తొలి స్థానం సంపాదించాడు. ఆల్‌రౌండర్ల జాబితాలో టీమిండియాకు చెందిన రవీంద్ర జడేజాకు మాత్రమే టాప్ టెన్‌లో చోటు దక్కింది.
ఇక, ఐసీసీ టీ-20 ర్యాంకింగ్స్‌లో కూడా టీమిండియానే అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ నిలిచాయి. ఇక, టీ-20 బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియాకు చెందిన ట్రావిస్ హెడ్ తొలి స్థానంలో ఉన్నాడు. టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మకు ఈ జాబితాలో రెండో స్థానం దక్కింది. అలాగే తిలక్ వర్మ (4వ స్థానం), సూర్య కుమార్ యాదవ్ (5వ స్థానం) కూడా టాప్ టెన్‌లో చోటు దక్కించుకున్నారు.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..