Share News

Tennis Player Harriet Dart: దుర్వాసన వస్తోంది స్ర్పే చేసుకోమనండి

ABN , Publish Date - Apr 18 , 2025 | 02:46 AM

బ్రిటన్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి హ్యారిట్‌ డార్ట్‌ ఫ్రాన్స్‌ క్రీడాకారిణి లిస్‌ బాసన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసి విమర్శలకు గురైంది. దీనిపై నెటిజన్లు ఘాటుగా స్పందించడంతో, ఆమె బాసన్‌ను క్షమాపణలు చెప్పింది

Tennis Player Harriet Dart: దుర్వాసన వస్తోంది స్ర్పే చేసుకోమనండి

  • బ్రిటన్‌ టెన్నిన్‌ క్రీడాకారిణి తీరుపై విమర్శలు

పారిస్‌: ఫ్రాన్స్‌ క్రీడాకారిణి లిస్‌ బాసన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసి అభాసుపాలైంది బ్రిటన్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ హ్యారిట్‌ డార్ట్‌. విషయమేమిటంటే..రోయన్‌ ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నీలో బాసన్‌తో డార్ట్‌ తలపడింది. అయితే బాసన్‌ నుంచి దుర్వాసన వస్తోందని, డియోడరెంట్‌ స్ర్పే చేసుకోవాలని ఆమెకు చెప్పాలంటూ అంపైర్‌కు డార్ట్‌ సూచించింది. ఇది కోర్టు పక్కన ఉన్న మైక్రోఫోన్ల ద్వారా బయటకు వినిపించింది. దాంతో డార్ట్‌ వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడ్డారు. వెల్లువలా విమర్శలు వచ్చిపడడంతో తప్పును గ్రహించిన హ్యారిట్‌..బాసన్‌ను క్షమాపణలు కోరింది.

Updated Date - Apr 18 , 2025 | 02:47 AM