Share News

Harbhajan Singh: టెస్టు క్రికెట్‌ను నాశనం చేశారు: భజ్జీ

ABN , Publish Date - Nov 18 , 2025 | 06:51 AM

సౌతాఫ్రికాతో టీమిండియా తొలి టెస్ట్ ఓడిపోవడంపై మాజీ స్టార్ క్రికెటర్ హర్భజన్ సింగ్ స్పందించాడు. టెస్టు క్రికెట్‌ను సర్వనాశనం చేశారని మండిపడ్డారు. 124 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని స్వదేశంలోనే ఛేదించలేకపోవడం ఏంటని ప్రశ్నించాడు.

Harbhajan Singh: టెస్టు క్రికెట్‌ను నాశనం చేశారు: భజ్జీ
Harbhajan Singh

ఇంటర్నెట్ డెస్క్: కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో టీమిండియా పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత మాజీ ఆఫ్‌స్పిన్నర్ హర్భజన్ సింగ్(Harbhajan Singh) ఈ విషయంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. టెస్టు క్రికెట్‌పే నాశనం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 124 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని స్వదేశంలోనే ఛేదించలేకపోవడం ఏంటని ప్రశ్నించాడు.


‘వాళ్లు టెస్టు క్రికెట్‌ను సర్వనాశనం చేశారు. చాలా ఏళ్లుగా చూస్తున్నా. పేలవమైన పిచ్‌లు తయారు చేస్తున్నారు. ప్రత్యర్థులు వికెట్లు తీసుకున్నప్పటికీ.. జట్టు గెలుస్తోంది కాబట్టి ఎవ్వరూ ఈ పిచ్‌ల గురించి మాట్లాడట్లేదు. ఈ వికెట్ల వల్ల ఎవరో గొప్ప వాళ్లు అవుతున్నారు. అంతా బాగుందని అందరూ అనుకుంటూ వచ్చారు. కానీ ఈ విధానం ఇప్పుడు మొదలైంది కాదు. చాలా ఏళ్లుగా ఇలాంటి పిచ్‌లను తయారు చేస్తున్నారు. ఇలా క్రికెట్ ఆడటం తప్పు. ఈ వికెట్లపై ఆడి క్రికెట్‌లో ప్రగతి సాధించలేం. గెలుస్తున్నాం.. కానీ ఎలాంటి ప్రయోజనం లేదు. క్రికెటర్లు కూడా ఎదగట్లేదు’ అని భజ్జీ వివరించాడు. కాగా తొలి టెస్ట్ ఓడిన తర్వాత ‘రిప్ టెస్ట్ క్రికెట్’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. హర్భజన్ టీమిండియా తరఫున 103 టెస్టుల్లో 417 వికెట్లు పడగొట్టారు.


ఆ స్థానం ఎవరిది?

తొలి టెస్ట్ గెలవడంతో సౌతాఫ్రికా 1-0 తేడాతో ఆధిక్యంలో ఉంది. రెండో టెస్టు అయినా టీమిండియా గెలవాలని చూస్తోంది. గెలిచినా సిరీస్ దక్కదు.. కానీ డ్రాగా ముగుస్తుంది. కాగా రెండో టెస్ట్ నవంబర్ 22(శనివారం)న గువాహటి వేదికగా జరగనుంది. మెడ నొప్పితో రిటైర్డ్ హర్డ్‌గా వెనుదిరిగిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఈ టెస్టుకు కూడా అందుబాటులో ఉండకపోవచ్చు. దీంతో ఈ స్థానంలో సాయి సుదర్శన్ లేదా దేవదత్ పడిక్కల్‌ను ఆడించే అవకాశం ఉంది.


ఇవి కూడా చదవండి:

అతడిని జట్టులోకి తీసుకో: గంగూలీ

ఎక్కడో తప్పు జరుగుతోంది: పుజారా

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 18 , 2025 | 06:51 AM