Share News

Gambhir: విహార యాత్ర కోసం రాలేదు

ABN , Publish Date - Jul 12 , 2025 | 02:58 AM

భారత క్రికెటర్లు విదేశీ పర్యటనలకు వెళ్లేది విహారం కోసం కాదని, ఎక్కువ సమయం ఆటపైనే దృష్టి పెట్టాల్సి ఉంటుందని కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ స్పష్టం చేశాడు..

Gambhir: విహార యాత్ర కోసం రాలేదు

లండన్‌: భారత క్రికెటర్లు విదేశీ పర్యటనలకు వెళ్లేది విహారం కోసం కాదని, ఎక్కువ సమయం ఆటపైనే దృష్టి పెట్టాల్సి ఉంటుందని కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ స్పష్టం చేశాడు. ఈమేరకు కుటుంబ సభ్యులను తమ వెంట తెచ్చుకోవడంపై బీసీసీఐ విధించిన ఆంక్షలకు పూర్తి మద్దతు ప్రకటించాడు. ‘ఎవరికైనా కుటుంబాలు ముఖ్యమే. కానీ ఆటగాళ్లు ఓ విషయం గుర్తుంచుకోవాలి. మీరంతా ఇక్కడికి వచ్చింది హాలీడే కోసం కాదు. ఓ లక్ష్యంతో వచ్చారు. ఎంతో మందిలో కేవలం మీకు మాత్రమే దేశం గర్వపడేలా ఆడే అవకాశం వచ్చింది. అందుకే దృష్టంతా ఆటపైనే ఉండడం అవసరం’ అని పుజారకిచ్చిన ఇంటర్వ్యూలో గంభీర్‌ తేల్చాడు.

Updated Date - Jul 12 , 2025 | 02:58 AM