Share News

Irfan Khan - Virat Kohli: సోషల్‌ మీడియాను పట్టించుకోవద్దు: కోహ్లీకి ఇర్ఫాన్ సూచన

ABN , Publish Date - Oct 24 , 2025 | 03:10 PM

వరుసగా రెండు మ్యాచుల్లోనూ డకౌట్‌ కావడంతో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై సోషల్‌ మీడియాలో చర్చలు మొదలయ్యాయి. ఇక విరాట్ రిటైర్మెంట్‌కు వేళైందా? అనే సందేహాలూ అభిమానుల్లో వస్తున్నాయి.

Irfan Khan - Virat Kohli: సోషల్‌ మీడియాను పట్టించుకోవద్దు: కోహ్లీకి ఇర్ఫాన్ సూచన
Virat Kohli

ముంబై, అక్టోబర్ 24: వరుసగా రెండు మ్యాచుల్లోనూ డకౌట్‌ కావడంతో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli)పై సోషల్‌ మీడియాలో చర్చలు మొదలయ్యాయి. ఇక విరాట్ రిటైర్మెంట్‌కు వేళైందా? అనే సందేహాలూ అభిమానుల్లో వస్తున్నాయి. ఈ నేపథ్యంలో విరాట్ ఆటపై మాజీ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్(Irfan Pathan) స్పందించాడు.


‘విరాట్ కోహ్లీ వరుసగా రెండుసార్లు డకౌట్‌ కావడం చాలా అరుదు. దానికి ఒత్తిడి, ఆటకు దూరంగా ఉండటం కారణమై ఉండొచ్చు. ఇలాంటి సమయంలో అభిమానులు, సెలక్టర్లు మద్దతుగా నిలబడాలి. పరుగులు చేయడం ప్రారంభిస్తే.. విరాట్‌ను ఎవ్వరూ ఆపలేరు. ఎందుకంటే కోహ్లీకి వన్డేలంటే చాలా ఇష్టం. అతడు ఆటోమేటిక్‌గా ఆ లయను అందుకుంటాడు. యశస్వి జైస్వాల్‌ లాంటి యువ ఆటగాళ్లు మరోవైపు సిద్ధంగా ఉన్నప్పుడు సీనియర్లపై ఒత్తిడి ఉంటుంది. దాన్ని తట్టుకుని ఆడటం అంత సులువేం కాదు.


ఈ సందర్భంగా అభిమానులకు ఓ విజ్ఞప్తి. దయచేసి ఎవరూ విరాట్, రోహిత్ వరల్డ్ కప్‌(World Cup)లో ఆడతారా? రిటైర్ అవుతారా? అనే చర్చను కొనసాగించొద్దు. ఇప్పుడు వాళ్లిద్దరూ ఆటను ఆస్వాదించేలా ఉండాలి. తప్పకుండా కోహ్లీ ఫామ్‌ను అందుకుంటాడు. అందుకోసం సహనంగా ఉండాలి. సోషల్ మీడియా(Social Media)లో వచ్చే చర్చలను పట్టించుకోకుండా ఆడాలి’ అని ఇర్ఫాన్ వెల్లడించాడు.


కోహ్లీకి గావస్కర్‌ సపోర్ట్‌..

ఇదే అంశంపై క్రికెట్‌ దిగ్గజం సునీల్‌ గావస్కర్‌(Sunil Gavaskar) కూడా స్పందించారు. ‘రెండు డకౌట్‌లకే రిటైర్మెంట్(Retirement) మాట తీసుకురావడం అనవసరం. విరాట్‌ క్లాస్‌ ఏంటో అందరికీ తెలుసు. వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్ కూడా అతడే. కేవలం వారికి కావాల్సింది సమయం. ఒక మంచి ఇన్నింగ్స్‌ చాలు.. మళ్లీ అతడు పాత ఫామ్‌లోకి వస్తాడు’ అని గావస్కర్ వ్యాఖ్యానించాడు.


Also Read:

ఎన్డీయే సీఎం అభ్యర్థి నితీశ్... తొలి ప్రచార సభలో మోదీ

బ్యాంకు ఖాతాదారులకు కేంద్రం మరో గుడ్ న్యూస్..

Updated Date - Oct 24 , 2025 | 03:20 PM