Share News

Shashank Singh: చెంప పగులగొట్టినా తప్పు లేదు.. శశాంక్ సింగ్ సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - Jun 09 , 2025 | 02:33 PM

పంజాబ్ కింగ్స్ స్టార్ బ్యాటర్ శశాంక్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. చెంప పగులగొట్టినా తప్పు లేదన్నాడు. మరి.. శశాంక్ ఇలా ఎందుకు మాట్లాడాడో ఇప్పుడు చూద్దాం..

Shashank Singh: చెంప పగులగొట్టినా తప్పు లేదు.. శశాంక్ సింగ్ సంచలన వ్యాఖ్యలు
Shashank Singh

పంజాబ్ కింగ్స్ ఆశలు నెరవేరలేదు. 18 ఏళ్లుగా అందని ద్రాక్షగా ఉన్న ఐపీఎల్ ట్రోఫీని ఈసారైనా అందుకోవాలని అనుకుంది అయ్యర్ సేన. అయితే తృటిలో కప్పు చేజార్చుకుంది. ఆర్సీబీతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 6 పరుగుల తేడాతో ఓడి రన్నరప్‌గా నిలిచింది పంజాబ్. దీంతో ఆ టీమ్‌ ఓటమిపై పోస్ట్‌మార్టం చేస్తోంది. ఎక్కడ తప్పు జరిగింది.. తదుపరి సీజన్‌లో చేయాల్సిన మార్పుచేర్పులపై సమాలోచనలు చేస్తోంది. ఈ తరుణంలో పంజాబ్ పించ్ హిట్టర్ శశాంక్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. క్వాలిఫయర్-2లో తాను పెద్ద తప్పు చేశానని.. అందుకు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తనను కొట్టినా తప్పు లేదన్నాడు. శశాంక్ ఇంకా ఏమన్నాడంటే..


ఇలాంటోడ్ని చూడలేదు..

‘నేను చేసింది ముమ్మాటికీ తప్పే. శ్రేయస్ అయ్యర్ నా చెంప పగులగొట్టాల్సింది. ఫైనల్ మ్యాచ్ వరకు మా నాన్న నాతో మాట్లాడలేదు. ఆ సమయంలో అలా చేసుండాల్సింది కాదు. నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదని అయ్యర్ నాతో అన్నాడు. ఆ తర్వాత నన్ను డిన్నర్‌కు తీసుకెళ్లాడు. అతడి లాంటి కెప్టెన్‌ను నేను చూడలేదు. ప్రస్తుత ప్రపంచ క్రికెట్‌లో అతడి కంటే మెరుగైన సారథి లేడు. అతడు మాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాడు. అతడు అందర్నీ సమానంగా చూస్తాడు. అయ్యర్‌ వ్యక్తిత్వాన్ని ఎవరూ ప్రశ్నించలేరు. అతడు చాలా మంచోడు. జట్టులోని ప్రతి ఆటగాడి నుంచి సలహాలు, సూచనలు తీసుకోవడానికి అతడు సంసిద్ధంగా ఉంటాడు’ అని శశాంక్ చెప్పుకొచ్చాడు.


తప్పు ఇదే..

క్వాలిఫయర్-2లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో శశాంక్ రనౌట్ అయ్యాడు. ఒక ఎండ్‌లో అయ్యర్ అదరగొడుతుండగా.. కీలక సమయంలో బ్యాటింగ్‌కు వచ్చిన శశాంక్ (2) అనవసర రన్ కోసం వెళ్లి ఔట్ అయ్యాడు. హార్దిక్ పాండ్యా డైరెక్ట్ త్రోకు అతడు బలయ్యాడు. అయితే అతడు ఔట్ అయినా స్టొయినిస్ (2) సాయంతో మ్యాచ్‌ను ముగించాడు అయ్యర్. కానీ పోరు పూర్తయ్యాక శశాంక్ మీద సీరియస్ అయ్యాడు. ఈ రనౌట్ కారణంగా శశాంక్‌తో అతడి తండ్రి కూడా మాట్లాడలేదు. ఈ నేపథ్యంలో తాజాగా తన తప్పును ఒప్పుకున్న పించ్ హిట్టర్.. అయ్యర్ తనను చెంపదెబ్బ కొట్టినా తప్పు లేదన్నాడు.


ఇవీ చదవండి:

ఆర్సీబీపై వేలాడుతున్న నిషేధం కత్తి

లేడీ అంపైర్‌పై అశ్విన్ సీరియస్

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 09 , 2025 | 02:49 PM