India Loss Early Wickets: టీమిండియాకు షాక్.. ఎంత పని చేశావ్ ఆర్చర్?
ABN , Publish Date - Jul 14 , 2025 | 04:11 PM
లార్డ్స్ టెస్ట్ ఐదో రోజు ఆరంభంలోనే భారత్‌కు గట్టి షాక్ తగిలింది. ఇంగ్లండ్ ప్రధాన పేసర్ జోఫ్రా ఆర్చర్ టీమిండియాను కోలుకోలేని దెబ్బ తీశాడు.

లార్డ్స్ టెస్ట్ ఐదో రోజు ఆరంభంలోనే భారత్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మ్యాచ్ గెలిపిస్తాడని అనుకున్న వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ (9) ఆట ఆరంభంలోనే ఔట్ అయ్యాడు. రెండు బౌండరీలతో మంచి టచ్‌లో కనిపించిన రిషబ్‌ను స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ వెనక్కి పంపించాడు. గుడ్ లెంగ్త్‌లో పడిన బంతి ఒక్కసారిగా ఆఫ్ స్టంప్ అవతలి నుంచి లోపలకు దూసుకొచ్చింది. బంతిని డిఫెన్స్ చేసేందుకు పంత్ ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. యాంగిల్ నుంచి లోపలకు వచ్చిన బంతి అతడి బ్యాట్‌ను దాటుకొని వెళ్లి స్టంప్స్‌ను చెల్లాచెదురు చేసేసింది. దీంతో పంత్ నిరాశగా క్రీజును వీడాడు.
క్యూ కట్టారు..
ఔట్ అయ్యాక పంత్ పెవిలియన్ వైపు నడక సాగించాడు. అయితే ఆర్చర్ అతడ్ని వెంబడించి ఏదో కామెంట్ చేశాడు. అయినా టీమిండియా వైస్ కెప్టెన్ స్పందించలేదు. అతడు సైలెంట్‌గా నడుచుకుంటూ డ్రెస్సింగ్ రూమ్ వైపు వెళ్లిపోయాడు. పంత్ ఔట్ అయిన కాసేపటికే భారత్ మరో 2 వికెట్లు కోల్పోయింది. కేఎల్ రాహుల్ (39)ను బెన్ స్టోక్స్ వెనక్కి పంపించాడు. వాషింగ్టన్ సుందర్ (0)ను ఆర్చర్ ఔట్ చేశాడు. ఇలా 11 పరుగుల వ్యవధిలో 3 వికెట్లు కోల్పోయింది టీమిండియా. మెన్ ఇన్ బ్లూ విజయానికి ఇంకా 111 పరుగులు కావాలి. క్రీజులో ఉన్న జడేజా (8 నాటౌట్), నితీష్ రెడ్డి (0 నాటౌట్) చివరి వరకు నిలబడి మ్యాచ్‌ను ముగించాలి. వీరిలో ఒక్కరు ఔట్ అయినా టెయిలెండర్లు నిలబడే పరిస్థితులు కనిపించడం లేదు. కాబట్టి మ్యాచ్‌ను ఫినిష్ చేయాల్సిన బాధ్యత ఇద్దరి మీదే ఉంది.
ఇవీ చదవండి:
ఇంగ్లండ్‌కు ఇచ్చిపడేసిన సుందర్!
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి