Preity Zinta-Faf Du Plessis: ప్రీతి జింటాతో రొమాన్స్.. డుప్లెసిస్ మామూలోడు కాదు!
ABN , Publish Date - May 25 , 2025 | 06:50 PM
ఐపీఎల్-2025లో ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లింది పంజాబ్ కింగ్స్. 11 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ప్లేఆఫ్స్‌కు క్వాలిఫై అయింది పంజాబ్. దీంతో ఆ జట్టు సహ యజమాని ప్రీతి జింటా ఫుల్ హ్యాపీగా ఉంది.

ఐపీఎల్-2025లో అదరగొడుతోంది పంజాబ్ కింగ్స్. కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని ఈ టీమ్.. ఈసారి ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. వరుస విజయాలతో హోరెత్తిస్తున్న పంజాబ్.. ఎలాగైనా తొలి కప్పు కలను నిజం చేసుకోవాలని అనుకుంటోంది. 11 ఏళ్ల తర్వాత ప్లేఆఫ్స్ బరిలోకి అడుగుపెడుతున్న జట్టు.. ఈ చాన్స్‌ను అస్సలు మిస్ అవ్వొద్దని చూస్తోంది. ఇదే సమయంలో లీగ్ దశను కూడా విజయాలతో ముగించాలని భావిస్తోంది. అయ్యర్ సేనకు అభిమానులతో పాటు జట్టు సహ యజమాని ప్రీతి జింటా నుంచి కూడా భారీ మద్దతు లభిస్తోంది. ఫ్రాంచైజీ యాజమాన్యంలో గొడవలు జరుగుతున్నా టీమ్‌కు ఫుల్ సపోర్ట్ అందిస్తోంది ప్రీతి. అలాంటిది ఒక్క ఫొటోతో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిందామె. అసలు ఈ ఫొటో కథాకమామీషు ఏంటి.. అనేది ఇప్పుడు చూద్దాం..
ఫొటోలు వైరల్!
పంజాబ్ కింగ్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం వేదికగా శనివారం ఆసక్తికర మ్యాచ్ జరిగింది. ఈ పోరులో డీసీ 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. అయితే పోరు ముగిసిన తర్వాత ఇరు జట్ల ఆటగాళ్లు ఎప్పటిలాగే ఒకర్నొకరు కలుసుకొని ఆలింగనం చేసుకున్నారు. ఇదే తరుణంలో పంజాబ్ కో-ఓనర్ ప్రీతి జింటా వెళ్లి డీసీ ఓపెనర్ ఫాప్ డుప్లెసిస్‌ను కలిసింది. అతడితో కాసేపు ముచ్చటించింది. ఈ సమయంలో తీసిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
లుక్స్‌కు ఫిదా!
వైరల్ అవుతున్న ఫొటోల్లో డుప్లెసిస్ చేతులు కట్టుకొని నిలబడ్డాడు. అటు ప్రీతి జింటా గాలి వీస్తుండటంతో తన జుట్టును సవరించుకుంటూ కనిపించింది. బ్లాక్ కలర్ డ్రెస్‌లో ఆమె క్యూట్ లుక్స్‌కు అంతా ఫిదా అయిపోయారు. పక్కనే ఉన్న డుప్లెసిస్ కూడా స్టైలిష్‌గా, హ్యాండ్సమ్ హంక్‌లా కనిపిస్తుండటంతో నెటిజన్స్ ఈ జంటపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఈ పెయిర్ అదిరిపోయిందని, వీళ్లతో ఓ సినిమా ప్లాన్ చేయాలని కోరుతున్నారు. డుప్లెసిస్ యాక్షన్ హీరోలా కనిపిస్తున్నాడని, ప్రీతి ఎప్పటిలాగే అందానికి అసూయ పుట్టించేలా ఉందని చెబుతున్నారు. ఈ కామెంట్స్‌పై డీసీ ఓపెనర్ స్పందించాడు. ఇది జరిగేలా చూడండి అంటూ అతడు రిప్లయ్ ఇచ్చాడు. దీంతో డుప్లెసిస్ మామూలోడు కాదు భయ్యా, రొమాన్స్ ఫిక్స్ చేయాలని ఫ్యాన్స్‌ను కోరుతున్నాడని అంటున్నారు. మరి.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఈ జంట నిజంగానే సిల్వర్ స్క్రీన్ మీద కలసి సందడి చేస్తారేమో చూడాలి.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి