Share News

KL Rahul LBW Controversy: కేఎల్ రాహుల్‌ ఔట్‌పై వివాదం.. కరెక్ట్ టైమ్‌లో దెబ్బ కొట్టారు!

ABN , Publish Date - Jul 14 , 2025 | 08:13 PM

లార్డ్స్ టెస్ట్‌లో ఎదురీదుతోంది టీమిండియా. నాలుగు రోజులు దుమ్మురేపిన భారత్.. ఐదో రోజు ఆటలో మాత్రం అంతగా ప్రభావం చూపలేకపోయింది. మన బ్యాటర్లంతా చేతులెత్తేశారు.

KL Rahul LBW Controversy: కేఎల్ రాహుల్‌ ఔట్‌పై వివాదం.. కరెక్ట్ టైమ్‌లో దెబ్బ కొట్టారు!
KL Rahul

ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లండ్ కథ ముగించిన భారత్.. లార్డ్స్‌లోనూ అదే పని చేస్తుందని అంతా అనుకున్నారు. క్రికెట్‌కు పుట్టినిల్లు అయిన ఈ గ్రౌండ్‌లో జరుగుతున్న మూడో టెస్ట్‌లోనూ నెగ్గి సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్తుందని భావించారు. అందుకు తగ్గట్లే నాలుగు రోజులు దుమ్మురేపింది గిల్ సేన. దీంతో భారత్ విజయం ఖాయమని అభిమానులు ఆశలు పెంచుకున్నారు. కానీ బ్యాటర్లు చేతులెత్తేయడంతో మన జట్టు ఎదురీదుతోంది. వరుసగా వికెట్లు కోల్పోతూ వచ్చిన మెన్ ఇన్ బ్లూ.. ఓటమి అంచున నిలబడింది. అయితే మిగతా డిస్మిసల్స్ సంగతి పక్కనబెడితే.. కేఎల్ రాహుల్ ఔట్ మాత్రం వివాదాస్పదంగా మారింది. దీనిపై బ్యాటింగ్ గ్రేట్ సునీల్ గవాస్కర్ స్పందించాడు.


స్టోక్స్ బౌలింగ్‌లో..

రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు కేఎల్ రాహుల్. 58 బంతుల్లో 39 పరుగులు చేసిన స్టైలిష్ బ్యాటర్.. అప్పటివరకు బాగానే బ్యాటింగ్ చేస్తూ వచ్చాడు. కానీ స్టోక్స్ వేసిన అద్భుతమైన డెలివరీకి అతడు వెనుదిరగక తప్పలేదు. స్లోప్ మీద పడిన బంతి దిశ మార్చుకొని వేగంగా లోపలి వైపుకు దూసుకురావడంతో దాన్ని డిఫెండ్ చేయలేకపోయాడు రాహుల్. ఎల్బీడబ్ల్యూ కోసం అప్పీల్ చేయగా.. అంపైర్ ఔట్ ఇవ్వలేదు. దీంతో స్టోక్స్ డీఆర్ఎస్ కోరగా.. రీప్లేలో క్లియర్ ఔట్‌గా తేలింది. అయితే గవాస్కర్ మాత్రం ఈ నిర్ణయం విషయంలో అసంతృప్తి వ్యక్తం చేశాడు.


ఇదేం టెక్నాలజీ?

‘భారత బౌలింగ్ సమయంలో చాలా బంతులు బౌన్స్ అయ్యాయి. స్టంప్స్ మీద నుంచి వెళ్లాయి. కానీ రాహుల్ ఔట్ అయిన బంతి అంతగా బౌన్స్ అవ్వలేదు. టెక్నాలజీపై నాకు సందేహాలు ఉన్నాయి. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ టైమ్‌లో సిరాజ్ బౌలింగ్‌లో జో రూట్ ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. రాహుల్‌లాగే రూట్ విషయంలో బ్యాట్ ప్యాడ్స్‌కు తగిలింది. అక్కడ కూడా అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. లెగ్ స్టంప్ స్పష్టంగా కనిపిస్తున్నా రివ్యూలో మాత్రం నాటౌట్ ఇచ్చారు’ అని గవాస్కర్ చెప్పుకొచ్చాడు. ఇది చూసిన నెటిజన్స్.. భారత్‌ను కరెక్ట్ టైమ్‌లో దెబ్బ కొట్టారని అంటున్నారు. అంపైర్లతో పాటు డీఆర్ఎస్‌‌లు కూడా టీమిండియాకు వ్యతిరేకంగా వచ్చాయని ఆరోపిస్తున్నారు.


ఇవీ చదవండి:

ప్లేయర్లను చితకబాదిన కోచ్!

కేఎల్ రాహుల్‌కు తప్పని తిట్లు!

ప్లేయర్ల కోసం ఫ్రాంచైజీల పోటాపోటీ!

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 14 , 2025 | 08:19 PM