Share News

KL Rahul Daughter: వారసురాలి పేరు రివీల్ చేసిన కేఎల్ రాహుల్.. వెరైటీగా ఉందే..

ABN , Publish Date - Apr 18 , 2025 | 05:16 PM

Athiya Shetty: టీమిండియా స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహుల్-అతియా శెట్టి దంపతులకు పండంటి ఆడబిడ్డ పుట్టిన సంగతి తెలిసిందే. తమ వారసురాలి పేరును ఈ కపుల్ తాజాగా రివీల్ చేశారు.

KL Rahul Daughter: వారసురాలి పేరు రివీల్ చేసిన కేఎల్ రాహుల్.. వెరైటీగా ఉందే..
KL Rahul

టీమిండియా స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఇటీవల తండ్రయ్యాడు. రాహుల్-అతియా శెట్టి దంపతులకు మార్చి 24వ తేదీన పండంటి ఆడబిడ్డ పుట్టింది. దీంతో ఈ కపుల్‌తో పాటు కేఎల్ అభిమానులు సంతోషంలో మునిగిపోయారు. ఇక, రాహుల్‌కు తిరుగులేదని.. ఆల్రెడీ భీకర ఫామ్‌లో ఉన్నాడు కాబట్టి మున్ముందు మరింత రెచ్చిపోయి ఆడతాడని ఫ్యాన్స్ చెబుతూ వచ్చారు. అందుకు తగ్గట్లే ప్రస్తుత ఐపీఎల్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు కేఎల్. ఈ తరుణంలో తాజాగా తన వారసురాలి పేరును బయటపెట్టాడీ స్టార్ బ్యాటర్. మరి.. రాహుల్ కూతురి పేరేంటి, దానికి అర్థం ఏంటనేది ఇప్పుడు చూద్దాం..


అర్థం ఇదే..

కూతురికి ఇవారా అని నామకరణం చేశారు కేఎల్ రాహుల్-అతియా దంపతులు. ఈ పదానికి దేవుడి బహుమతి అని అర్థం. ఏప్రిల్ 18న రాహుల్ పుట్టిన రోజు. ఇవాళ 33వ పడిలోకి అడుగుపెట్టాడీ స్టార్ బ్యాటర్. ఈ సందర్భంగానే తన కూతురి పేరును అందరితో షేర్ చేశాడు రాహుల్. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫొటో పంచుకున్నాడు రాహుల్. ఇందులో చేతిలో బిడ్డతో కేఎల్ కనిపిస్తున్నాడు. అతడి పక్కనే ఉన్న అతియా పాపను గారాబం చేస్తూ దర్శనమిచ్చింది. రాహుల్ వారసురాలి పేరును విన్న నెటిజన్స్.. నేమ్ వెరైటీగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. గాడ్ గిఫ్ట్ అదిరిందని.. కెరీర్‌లో ఇదేరీతిలో రాహుల్ జెట్ స్పీడ్‌తో దూసుకెళ్లాలని కోరుకుంటున్నారు. కాగా, కేఎల్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్‌ తాజా ఎడిషన్‌లో అదరగొడుతోంది. 6 మ్యాచుల్లో 5 విజయాలతో పాయింట్స్ టేబుల్‌లో టాప్ ప్లేస్‌లో కొనసాగుతోంది డీసీ.


ఇవీ చదవండి:

సీఎస్‌కేలోకి డివిలియర్స్ వారసుడ

ఐపీఎల్ నుంచి కమిన్స్ ఔట్

స్టార్ క్రికెటర్లు నాకు అశ్లీల ఫొటోలు పంపారు

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Apr 18 , 2025 | 05:21 PM