Share News

Rinku-Bhuvneshwar: రింకూతో భువీ డ్యాన్స్.. మాస్ స్టెప్స్‌తో ఇరగదీశారు!

ABN , Publish Date - Jun 10 , 2025 | 04:07 PM

భారత జట్టు ఫినిషర్ రింకూ సింగ్ త్వరలో ఓ ఇంటివాడు కానున్నాడు. ప్రియా సరోజ్‌తో అతడి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. అయితే ఈ వేడుకలో ఓ టీమిండియా స్టార్ మాస్ స్టెప్స్‌తో రచ్చ రచ్చ చేశాడు.

Rinku-Bhuvneshwar: రింకూతో భువీ డ్యాన్స్.. మాస్ స్టెప్స్‌తో ఇరగదీశారు!
Rinku-Bhuvneshwar

టీమిండియాలో ఇప్పుడు పెళ్లి సీజన్ నడుస్తోంది. ఒక్కొక్కరుగా యువ క్రికెటర్లు అంతా పెళ్లి బాట పడుతున్నారు. ఇటీవలే స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ నిశ్చితార్థ వేడుక వైభవంగా జరిగింది. అనంతరం పించ్ హిట్టర్ రింకూ సింగ్ కూడా ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు. ఎంపీ ప్రియా సరోజ్‌తో అతడి నిశ్చితార్థం జరిగింది. దీనికి స్పోర్ట్స్ సెలెబ్రిటీలతో పాటు రాజకీయ రంగం నుంచి కూడా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అయితే ఆ కార్యక్రమంలో స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్ అందరికంటే ఎక్కువ హైలైట్ అయ్యాడు. రింకూతో కలసి మాస్ స్టెప్స్ వేస్తూ ఈవెంట్‌లో రచ్చ రచ్చ చేశాడు భువీ. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.


మాస్ స్టెప్స్‌తో..

రింకూ సింగ్ నిశ్చితార్థ వేడుకలో అప్పటికే పలువురు డ్యాన్స్ చేయడం మొదలుపెట్టారు. రింకూ కాబోయే సతీమణి ప్రియా సరోజ్ కూడా కాలు కదుపుతూ అందరిలో జోష్ నింపింది. ఈ తరుణంలో అటు వైపుగా వచ్చిన భువనేశ్వర్‌ కుమార్‌ను డ్యాన్స్ చేయాలని రింకూ-ప్రియా సరోజ్ కోరారు. దీంతో హుషారుగా స్టెప్స్ వేశాడు భువీ. రింకూ కూడా కాలు కదపడంతో అందరిలో జోష్ మరింత పెరిగింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఇది చూసిన నెటిజన్స్.. రింకూ-భువీ డ్యాన్స్ అదిరిందని అంటున్నారు. రింకూ కాబోయే భార్య ప్రియా సరోజ్ డ్యాన్స్ స్పెషల్ అని.. ఆమె ఎనర్జీ లెవల్స్ సూపర్బ్ అని మెచ్చుకుంటున్నారు. రింకూ-ప్రియ జంట చూడముచ్చటగా ఉందని ప్రశంసిస్తున్నారు.


ఇవీ చదవండి:

అమ్మకానికి ఆర్సీబీ?

గిల్‌కు మరో ప్రమోషన్

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 10 , 2025 | 04:07 PM