Babar Azam: బాబర్ అజామ్ ఖాతాలో కొత్త రికార్డు
ABN , Publish Date - Nov 01 , 2025 | 04:59 PM
పాకిస్తాన్ బ్యాటర్ బాబర్ అజామ్ సరికొత్త రికార్డు సృష్టించాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక స్కోర్ చేసిన బ్యాటర్ల జాబితాలో బాబర్ అగ్రస్థానంలో నిలిచాడు. ఇప్పటి వరకు ఆ ప్లేస్ టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మదే. ప్రస్తుతం సౌతాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో బాబర్ 11 పరుగులు చేసి.. అంతర్జాతీయ టీ20ల్లో మోస్ట్ రన్స్ చేసిన బ్యాటర్‌గా నిలిచాడు.
ఇంటర్నెట్ డెస్క్: పాకిస్తాన్ బ్యాటర్ బాబర్(Babar Azam) అజామ్ సరికొత్త రికార్డు సృష్టించాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక స్కోర్ చేసిన బ్యాటర్ల జాబితాలో బాబర్ అగ్రస్థానంలో నిలిచాడు. ఇప్పటి వరకు ఆ ప్లేస్ టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)దే. ప్రస్తుతం సౌతాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో బాబర్ 11 పరుగులు చేసి.. అంతర్జాతీయ టీ20ల్లో మోస్ట్ రన్స్ చేసిన బ్యాటర్‌గా నిలిచాడు.
అంతర్జాతీయంగా 130 మ్యాచ్‌లు ఆడిన బాబర్.. 123 ఇన్నింగ్స్‌ల్లో 39.57 సగటుతో 4,234 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు ఉన్నాయి. అత్యధిక వ్యక్తిగత స్కోరు 22. ప్రస్తుతం క్రికెట్ ఆడుతున్న క్రికెటర్లలో రిజ్వాన్(3,414) మాత్రమే ఈ రికార్డుకు కాస్త దగ్గరగా ఉన్నాడు. అతడికి ఇటీవల జట్టులో అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో ఇప్పటికిప్పుడు బాబర్ రికార్డుకు ముప్పు లేకపోయినా.. భారత స్టార్ ఆటగాడు అభిషేక్ శర్మ(Abhishek Sharma) భవిష్యత్తులో అధిగమించే అవకాశం లేకపోలేదని క్రికెట్ విశ్లేషకుల అభిప్రాయం.
బాబర్ తర్వాత..
* రోహిత్ శర్మ (Rohit Sharma) 159 మ్యాచుల్లో 151 ఇన్నింగ్స్‌లు ఆడి 4,231 పరుగులు చేశాడు. ఇందులో ఐదు సెంచరీలు ఉన్నాయి. అత్యధిక వ్యక్తిగత స్కోరు 121*. ఇప్పటికే రోహిత్ అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే.
* విరాట్ కోహ్లీ (Virat Kohli) 125 మ్యాచుల్లో 117 ఇన్నింగ్స్‌ల్లో 4,188 పరుగులు చేసి మూడో స్థానంలో ఉన్నాడు. ఇందులో ఒకే ఒక్క సెంచరీ ఉంది. అత్యధిక వ్యక్తిగత స్కోరు 122*. సగటు 48.69 కావడం విశేషం. రోహిత్‌తో పాటు కోహ్లీ కూడా పొట్టి ఫార్మాట్‌కు రిటైర్‌మెంట్ ఇచ్చేశాడు.
* ఇంగ్లాండ్ ఆటగాడు జోస్ బట్లర్ (Jos Buttler) 144 మ్యాచుల్లో 132 ఇన్నింగ్స్‌లకు గాను 3,869 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ ఉంది. బట్లర్ అత్యధిక వ్యక్తిగత స్కోరు 101*.
* ఐర్లాండ్ క్రికెటర్ స్టిర్లింగ్(Paul Stirling) 153 మ్యాచుల్లో 150 ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఒక్క సెంచరీ చేసి.. 3,710 పరుగులు రాబట్టాడు. అతడి వ్యక్తిగత అత్యధిక స్కోరు 115*.
ఈ వార్తలు కూడా చదవండి:
Bopanna Retirement: రిటైర్‌మెంట్ ప్రకటించిన బోపన్న
Rodrigues: నా కోసం వికెట్ త్యాగం చేసింది: జెమీమా