Share News

Champions Trophy Finals Betting: భారత్ వర్సెస్ న్యూజిలాండ్‌పై భారీగా పందేలు.. ఢిల్లీ పోలీసుల విచారణలో సంచలన విషయాలు

ABN , Publish Date - Mar 09 , 2025 | 08:08 AM

నేడు జరగనున్న ఛాంపియన్స్ ట్రాఫీ ఫైనల్స్ మ్యాచ్‌ నేపథ్యంలో బెట్టింగులు పతాకస్థాయికి చేరుకున్నాయి. మ్యాచ్‌పై ఏకంగా రూ.5 వేల కోట్లు మేర బెట్టింగులు కాసినట్టు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఇందుకు సంబంధించి ఢిల్లీ పోలీసులు పలువురు బుకీలను తాజాగా అరెస్టు చేశారు.

Champions Trophy Finals Betting: భారత్ వర్సెస్ న్యూజిలాండ్‌పై భారీగా పందేలు.. ఢిల్లీ పోలీసుల విచారణలో సంచలన విషయాలు
Ind Vs New Zealand Champions Trophy finals

ఇంటర్నెట్ డెస్క్: నేడు భారత్ న్యూజిలాండ్ మధ్య జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్‌ క్రికెట్ అభిమానుల్లో ఉత్కంఠ రేపుతోంది. ఫెవరెట్‌గా బరిలో ఉన్న భారత్, దూకుడు మీదున్న న్యూజిలాండ్ జట్లలో గెలుపెవరిదన్న చర్చ పతాకస్థాయికి చేరుకుంది. ఈ ఉత్కంఠను ఆసరాగా చేసుకుని డబ్బులు కొల్లగొట్టేందుకు బెట్టింగ్ గ్యాంగులు రేడీ అయిపోయాయి. ఫైనల్ మ్యా్చ్‌పై దాదాపు 5 వేల కోట్ల మేర బెట్లు కట్టాయి. ఇందులో దావుద్ ఇబ్రహీంకు చెందిన గ్యాంగ్ హస్తం కూడా ఉన్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇటీవల ఢిల్లీ క్రైమ్ బ్యాంచ్ పోలీసులు పలువురు బెట్టింగ్ రాయళ్లను అరెస్టు చేయడంతో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. బుకీలకు అండర్ గ్రౌండ్ ప్రపంచంలో సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.

Also Read: అదరాలి ఫైనల్‌ పంచ్‌


ఢిల్లీ పోలీసులు తాజాగా ఐదుగురు బుకీలను అరెస్టు చేశారు. వారిని విచారించగా పలు షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. వీరిలో కొందరు ఇప్పటికే సెమీ ఫైనల్స్‌పై భారీగా బెట్టింగులు నిర్వహించారు. పర్వీన్ కొచ్చర్, సంజయ్ కుమారు ఇండియా ఆస్ట్రేలియా సెమీఫైనల్స్‌పై బెట్టింగ్ చేపట్టినందుకు అరెస్టు చేశారు. ల్యాప్‌టాప్స్‌, మొబైల్స్ ఉపయోగించి లైవ్‌లో బెట్టింగ్ నిర్వహిస్తుండగా పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కారు.

లక్కీ డాట్ కామ్ అనే వెబ్‌సైట్ ద్వారా పర్వీన్ కొచ్చర్ ఓ మాస్టర్ ఐడీ సృష్టించి దాని ద్వారా బెట్టింట్ ఐడీలు తయారు చేసి పంటర్‌లకు ఇచ్చాడు. ఒక్కో ట్రాన్సాక్షన్ కోసం ఈ ముఠా ఏకంగా 3 శాతం కమిషన్ తీసుకున్నట్టు పోలీసులు గుర్తించారు. ఇక మొబైల్స్ ద్వారా జోరుగా ఆఫ్‌లైన్ బెట్టింగ్‌కు పూనుకున్నారు. రూ.35 వేలు పెట్టి అద్దె ఇంట్లో నిందితులు ఈ కార్యకలాపాలు నిర్వహించారు. ప్రతి మ్యాచ్‌పై భారీగా లాభాలు మూటగట్టుకున్నారు. అయితే, ఈ నెట్వర్క్‌ను దుబాయ్ నుంచి కంట్రోల్ చేస్తున్నట్టు నిందితులు తెలిపారు.


Dubai Pitch Report: దుబాయ్ పిచ్ రిపోర్ట్.. భారత్-కివీస్‌లో ఎవరికి అనుకూలం..

ఛోటూ బన్సా్ల్ అనే వ్యక్తి కెనడాలో ఓ బెట్టింగ్ యాప్‌ను సిద్ధం చేశాడని, అతడు ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్నాడని పోలీసులు గుర్తించారు. ఢిల్లీలోని మోతీ నగర్‌కు చెందిన ఓ వ్యక్తి నేరుగా క్రికెట్ స్టేడియం నుంచే పరిస్థితులను ఎప్పటికప్పుడు బుకీలతో పంచుకున్నాడు. ఇక ఢిల్లీలో అరెస్టు చేసిన వారి నుంచి మొత్తం రూ.22 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ గ్యాంగ్‌కు మనీశ్ సాహానీ నేతృత్వం వహిస్తున్నట్టు పేర్కొన్నారు.

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 09 , 2025 | 08:19 AM